Soundarya-Uday Kiran : చిత్ర పరిశ్రమ కోల్పోయిన ఇద్దరు గొప్ప స్టార్స్ సౌందర్య, ఉదయ్ కిరణ్. కన్నడ అమ్మాయి అయిన సౌందర్య టాలీవుడ్ వేదికగా స్టార్ హోదా తెచ్చుకుంది. అనంతరం తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది. తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్న సౌందర్యను అభినవ సావిత్రి అని పిలిచేవారు. హీరోలకు సమానమైన స్టార్డం ఆమె అనుభవించారు. ఎంతో భవిష్యత్ ఉన్న సౌందర్య జీవితం అర్థాంతరంగా ముగిసింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావడంతో సౌందర్య అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు.
Also Read : సౌందర్య-మోహన్ బాబు ఆస్తి వివాదం… సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త, కీలక కామెంట్స్
సౌందర్య మరణించే నాటికి ఆమె వయసు కేవలం 31 ఏళ్ళు. టీనేజ్ లోనే పరిశ్రమకు రావడంతో అప్పటికే వందకు పైగా చిత్రాల్లో సౌందర్య నటించింది. చిన్న వయసులో కన్నుమూసిన మరొక స్టార్ ఉదయ్ కిరణ్. చిత్రం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఉదయ్ కిరణ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే.. బాక్సాఫీస్ షేక్ చేశాయి. లవర్ బాయ్ ఇమేజ్ తో ఉదయ్ కిరణ్ దూసుకుపోయాడు.
అయితే ఒక దశలో ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దానికి తోడు వ్యక్తిగత సమస్యలు. సున్నిత మనస్కుడైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2014 జనవరిలో ఈ విషాదం చోటు చేసుకుంది. మరణించే నాటికి ఉదయ్ కిరణ్ వయసు 33 ఏళ్ళు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చిన ఉదయ్ కిరణ్ టాప్ హీరోల లిస్ట్ లో చేరుతాడు అనుకుంటే, అనూహ్యంగా ప్రాణం తీసుకున్నాడు.
కాగా ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి ఒక చిత్రం చేశారు. ఆ మూవీ నర్తనశాల. హీరో బాలకృష్ణ తన డ్రీం ప్రాజెక్ట్ గా నర్తనశాల ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. నర్తనశాల చిత్రానికి బాలకృష్ణ దర్శకుడు కూడాను. శ్రీహరి, శ్రీకాంత్, శరత్ బాబు వంటి ప్రముఖ నటులు నటించారు. ఒక సౌందర్య ద్రౌపది పాత్ర చేసింది. బాలకృష్ణ నర్తనశాల చిత్రంలో అభిమన్యుడు పాత్రకు ఉదయ్ కిరణ్ ని తీసుకున్నాడట. సౌందర్యతో అభిమన్యుడికి కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. వాటిని చిత్రీకరించారట. సౌందర్య మరణంతో నర్తనశాల మూవీ ఆగిపోయింది. ఇటీవల అప్పటి వరకు చిత్రీకరించిన నర్తనశాల సన్నివేశాలు ఓటీటీలో విడుదల చేశారు. అభిమన్యుడు సీన్స్ సింక్ కాకపోవడంతో అందులో మెన్షన్ చేయలేదట.
Also Read : కీర్తి సురేష్ కి తన భర్త కి మధ్య వయస్సు తేడా ఎంత ఉందో తెలుసా..? వయస్సులో కీర్తి సురేష్ భర్త కంటే పెద్దదా!