Soumya Rao
Soumya Rao: సామాన్యులను స్టార్స్ గా మార్చిన ఘనత జబర్దస్త్ షో సొంతం చేసుకుంది. ఎందరో కమెడియన్స్ ని సిల్వర్ స్క్రీన్ కి జబర్దస్త్ అందించింది. ముఖ్యంగా యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. జబర్దస్త్ కి రాకముందు అనసూయ, రష్మీ హీరోయిన్ ఆఫర్స్ కోసం ట్రై చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ కావాలన్న వారి కోరిక జబర్దస్త్ యాంకర్స్ అయ్యాక తీరింది. ఆ షోకి ఉన్న క్రేజ్ రీత్యా యాంకర్ ఆఫర్ కోసం ఎగబడేవారు. కానీ అనసూయ, రష్మీ ఏళ్ల తరబడి సెటిల్ కావడంతో మరొకరికి ఛాన్స్ రాలేదు. మధ్యలో ఒకరిద్దరు మారినా సక్సెస్ కాలేదు.
Also Read: ‘చావా’ తెలుగు వెర్షన్ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ట్రేడ్ కి పెద్ద షాక్..ఇప్పట్లో ఆగేలా లేదు!
2022లో అనసూయ తప్పుకుంది. ఆమె స్థానంలోకి ఎవరొస్తారనే ఉత్కంఠ నడిచింది. అనూహ్యంగా కన్నడ అమ్మాయి సౌమ్యరావుకు అవకాశం ఇచ్చారు. ఇది ఊహించని పరిణామం. సౌమ్యరావు ఏమంత హాట్, గ్లామరస్ కాదు. పైగా తెలుగు పెద్దగా రాదు. హైపర్ ఆది ఓ రేంజ్ లో ఆడుకునేవాడు. తిరిగి పంచ్ వేయడానికి ఆమెకు భాష తెలియదు. ఏడాదికి పైగా నెట్టుకొచ్చింది. చివరికు తొలగించారు. సౌమ్యరావు హైపర్ ఆది కారణంగా షో నుండి వెళ్ళిపోయిందనే పుకార్లు వినిపించాయి. ఆమెతో ఎఫైర్ నడిపాడనే కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఈ వార్తలపై సౌమ్యరావు స్పందించింది. హైపర్ ఆదికి నాకు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. మేమిద్దరం ఒక షోకి పని చేశాము అంతే. కొత్త అమ్మాయిలపై హైపర్ ఆది పంచులు వేసి నవ్వించే ప్రయత్నం చేస్తాడు. వాళ్లతో పులిహోర కలుపుతాడు. అదంతా స్కిట్ బాగా రావాలనే ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదు. హైపర్ ఆది బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు, అని చెప్పుకొచ్చింది.
అంతకు ముందు జబర్దస్త్ నుండి తనను తొలగించారని, అది చాలా బాధించింది. నడిరోడ్డులో వదిలేసినట్లు అయ్యిందని ఆమె వాపోయారు. జబర్దస్త్ పోయినప్పటికీ సౌమ్యరావు శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తుంది. ఇక హైపర్ ఆది కూడా జబర్దస్త్ లో లేడు. ఆయన కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలకు పరిమితం అయ్యాడు. ఒకప్పటిలా జబర్దస్త్ అలరించడం లేదు.