https://oktelugu.com/

Shyam Singha roy: తమిళంలో కూడా డబ్బింగ్ పూర్తి చేసిన నాచురల్ స్టార్

Shyam Singha roy: నాచురల్ స్టార్ నాని హీరోగా పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం పాత్రలో నటిస్తున్నారు. నాని గత చిత్రాలు “వి , టక్ జగదీష్” ఓటీటీలో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలు నానికి ఆశించినంత హిట్ ఇవ్వలేకపోయాయి. దాదాపు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 08:40 PM IST
    Follow us on

    Shyam Singha roy: నాచురల్ స్టార్ నాని హీరోగా పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం పాత్రలో నటిస్తున్నారు. నాని గత చిత్రాలు “వి , టక్ జగదీష్” ఓటీటీలో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలు నానికి ఆశించినంత హిట్ ఇవ్వలేకపోయాయి.

    Shyam Singha Roy

    దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో “శ్యామ్ సింగ రాయ్” ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే తమిళ వెర్షన్‌ లో కుడా నాని సొంతగా డబ్బింగ్ చెప్పాడట.

    Also Read: “పుష్ప” రాజ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చిట్టిబాబు ” రామ్ చరణ్ “…

    ఈ సినిమా తమిళంలో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నాని అక్కడ సొంతగొంతు వినిపించబోతున్నాడు.తమిళ వెర్షన్‌లో తన పాత్రకు ఇటీవల డబ్బింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఇటీవలే రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. నాని కెరియర్లో ఈ చిత్రం ఒక మేలు రాయిలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో నాని కూడా పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి వెళతారో లేదో చూడాలంటే ఈ డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ స్వరాలను అందించారు.

    Also Read: మరో సరికొత్త షోకు శ్రీకారం చుట్టిన ‘ఆహా’