Sonu-Sood: కరోనా కాలంలో చేసిన సేవకు గానూ కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్ కి నెటిజన్లు ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇక పంజాబ్ వాళ్ళు అయితే సోనూ మా ‘పంజాబ్ ఐకాన్’ అని ప్రకటించుకున్నారు కూడా. మొత్తానికి ఈ హెల్పింగ్ స్టార్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. త్వరలో మీ అందరి ముందుకు ఫన్, మస్తీతో రాబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ రియల్ హీరో. సోనూసూద్ ఇంతకాలం తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయిన ఆయన మొదటిసారి ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.

కాగా ఈ విషయాన్ని సోనూ స్వయంగా వెల్లడించాడు. ‘MTVలో వచ్చే రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను.. నా జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్’ అని తాజాగా ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను విడుదల చేశాడు. సోనూసూద్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న విషయం ఏమిటంటే.. అభిమానులకు మరింతగా దగ్గరగా ఉండాలని.. కేవలం ఆ నిర్ణయంతోనే సోనూసూద్ హోస్ట్ గా చేయబోతున్నాడు అని తెలుస్తోంది. పైగా హోస్ట్ గా బాలయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కూడా సోనూసూద్ ఫీల్ అవుతున్నాడు.
Also Read: యూపీలో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ఏం ప్రయత్నాలు చేస్తోంది?

హోస్ట్ గా బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అందుకే.. బాలయ్య సోనూసూద్ కి ఆదర్శం అయ్యాడు. ఏది ఏమైనా కరోనా అనంతరం సాయం అనే పదానికి సోనూసూద్ పర్యాయపదం అయిపోయాడు. కొన్ని చోట్ల అయితే, సోనూకి ఒక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు కూడా జరిపించారు. ఈ కాలంలో ఇలా పూజలు అందుకున్న నటుడు బహుశా సోనూసూద్ మాత్రమే.
మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా మారిన సోనూ గురించి.. ఆయన చేసిన సేవలు, సాయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే.. కరోనా భారత దేశంలో తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టినప్పటి నుండీ సోనూసూద్ సేవ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. అందుకే.. అప్పటి నుంచి సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతూనే ఉంది.
అన్నట్టు జనం హృదయాల్లోకి బాగా వెళ్లిన సోనూసూద్ మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు. ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని సోనూసూద్ చెప్పుకొచ్చారు. మరి సోనూ ఏ పార్టీలో జాయిన్ అవుతాడో చూడాలి.
Also Read: ఇలాంటి రెండు రూపాయల నోటు మీ దగ్గర ఉంటే.. లక్షలు మీ సొంతం..!