Bhimla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా చెప్పాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్ తెరకెక్కింది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటూ థమన్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ ‘భీమ్లా నాయక్’లో హోమ్లీ బ్యూటీ నిత్యా మీనన్, యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read: ఆ సంచలన మూవీలో హీరోగా మొదటగా సోనూసూద్‌ను అనుకున్నారంట..!
ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి రన్ టైమ్ లాక్ చేశారు. సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఇతర పాటలు కూడా మూడు ఉన్నాయి. అందుకే, కొన్ని సీన్స్ ను తీసేశారు. మొత్తానికి సినిమాని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కేవలం 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారట. అవసరం అనుకుంటే మరో పది నిమిషాల సినిమాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్.

ఎందుకంటే.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే త్రివిక్రమే. ఎంతైనా మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు ప్లే మీద, మాటల మీద మంచి పట్టు ఉంది. ప్రస్తుతం, ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ కు పోటీగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ఏప్రిల్ రేసులో ఉన్నాయి. ఆ సినిమాలతో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ సినిమా రేంజ్ తక్కువే. మరి ఏప్రిల్ పోటీలో ‘భీమ్లా నాయక్’ ఏ స్థాయిలో నెగ్గుతాడో చూడాలి.
Also Read: జగన్ సర్కారుకు మిగిలింది రెండు రోజులే.. ఎటూ తేల్చకపోతే యుద్ధమే..!