Also Read: జైలు అప్డేట్ :పాపం రియాకు దిండు కూడా గతిలేదా?
తమ పిల్లలకు ఉన్నత విద్యనందించడానికి అణగారిన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను సోనూ గమనించాడు. దీంతో ఇప్పుడు వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగాడు. వారందరి కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రాం రెడీ చేశాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తానని ప్రకటించాడు.
వార్షికాదాయం 2 లక్షలలోపు ఉన్న కుటుంబాలకు చెందిన, మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చని సూచించారు. మెడిసిన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజం మొదలైన వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దీనికి అర్హులేనని సోనూ ప్రకటించారు. scholarships@sonusood.me మెయిల్‌కు పది రోజుల్లో తమ వివరాలు పంపించాల్సి ఉంది.
Also Read: పవన్, మహేష్ లను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
పేదల కోసం ఇన్ని విధాలా ఆలోచిస్తూ.. సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్న సోనూ సూద్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆయన చేసేది విలన్ పాత్రలే అయినా.. రియల్ లైఫ్ హీరో అని కొనియాడుతున్నారు.