https://oktelugu.com/

హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న సోనూ సూద్.. కారణమిదే!

మన స్టార్ హీరోలు రాంచరణ్, హీరోయిన్ సమంత సహా టాలీవుడ్ ప్రముఖులు ముంబైలో ఇళ్లు కొంటుంటే.. అందుకు విరుద్ధంగా బాలీవుడ్ లో ఉండే ప్రముఖ నటుడు సోనూ సూద్ హైదరాబాద్ కు వస్తున్నాడు. తాజాగా సోనూ సూద్ హైదరాబాద్లో ఇల్లు కొనేందుకు రెడీ అయ్యాడు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకొని దేశంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ చేతికి ఎముకే లేకుండా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అసహాయులను ఆదుకున్నాడు. ఇప్పుడు ఆయనకు దేశవ్యాప్తంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2021 / 03:37 PM IST
    Follow us on

    మన స్టార్ హీరోలు రాంచరణ్, హీరోయిన్ సమంత సహా టాలీవుడ్ ప్రముఖులు ముంబైలో ఇళ్లు కొంటుంటే.. అందుకు విరుద్ధంగా బాలీవుడ్ లో ఉండే ప్రముఖ నటుడు సోనూ సూద్ హైదరాబాద్ కు వస్తున్నాడు. తాజాగా సోనూ సూద్ హైదరాబాద్లో ఇల్లు కొనేందుకు రెడీ అయ్యాడు.

    కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకొని దేశంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ చేతికి ఎముకే లేకుండా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అసహాయులను ఆదుకున్నాడు. ఇప్పుడు ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.

    సోనూ సూద్ క్రేజ్ ను సినిమా వాళ్లు క్యాష్ చేసుకొని మంచి పాత్రలు సృష్టిస్తున్నారు. ఇక సోనూ కూడా తన క్రేజ్ తో రెమ్యూనరేషన్ పెంచేసి కోట్లు తీసుకుంటున్నారు.

    తెలుగులో ఇప్పుడు సోనూసూద్ కు విరివిగా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తోంది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా పార్క్ హయత్ హోటల్ లోనే ‘సోనూ సూద్ ’ బస చేసేవాడు.

    ఇక ఇప్పటి నుంచి హైదరాబాద్ లో సొంత ఇంట్లో ఉండాలని డిసైడ్ అయ్యాడట.. దీనికోసం ఒక ఇల్లు కొనుక్కోవాలని సోనూ సూద్ నిర్ణయించుకున్నాడు.

    హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే గృహ ప్రవేశం చేయబోతున్నాడు. సోనూకి ముంబైలో ఓ ఇల్లు ఉంది. ఆయన అక్కడేఉంటారు. కానీ తెలుగు సినిమాల కోసం హైదరాబాద్వచ్చినప్పుడు ఈ కొత్త ఇంట్లో మకాం పెడుతారు.

    సోనూ సూద్ వ్యక్తిగత వ్యవహారాలు, సామాజిక సేవ, కథా చర్చలకు ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.