ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన నర్సాపురం ఏంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పడు నర్సాపురం నియోజవర్గం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నాయకుల నుంచి వార్నింగ్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు, వైసీపీ నాయకుల విమర్శలే ఎదుర్కొన్నారు. ఇప్పడు విశాఖపట్నం వైసీపీ నాయకులు రాఘురామ రాజుపై విరుచుకుపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతి రాజధానిగా అంగీకరిస్తూ జగన్ అసెంబ్లీలో […]

Written By: Neelambaram, Updated On : July 26, 2020 7:34 pm
Follow us on


సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన నర్సాపురం ఏంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పడు నర్సాపురం నియోజవర్గం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నాయకుల నుంచి వార్నింగ్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు, వైసీపీ నాయకుల విమర్శలే ఎదుర్కొన్నారు. ఇప్పడు విశాఖపట్నం వైసీపీ నాయకులు రాఘురామ రాజుపై విరుచుకుపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతి రాజధానిగా అంగీకరిస్తూ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఇటీవల ఎంపీ రఘురామ రాజు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. మీడియా ముందు రాజధాని విషయంలో సిఎం జగన్ వైఖరిని తప్పుబట్టారు. అదేవిధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ మృతి పోలీసుల హత్యగా భావించాలని చెప్పారు.

Also Read: చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి..!

ఈ వ్యవహారంపై విశాఖ వైసీపీ నాయకులు, మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఉత్తరాంధ్ర జోలికోస్తే ఉపేక్షించేది లేదని ఏంపీకి వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. రాజు ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టాడంటే అది వై.ఎస్ జగన్ పెట్టిన బిక్ష అనే విషయాన్నిగుర్తు పెట్టుకోవాలన్నారు. వైసీపీ జెండాపై గెలిచి టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపురం విషయాల వరకే పరిమితం కావాలని సూచించారు. పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయాలని కోరారు. నలంద కిషోర్ మృతికి తాను బాధపడుతున్నాని, కరోనా ఎవరికైనా వస్తుందన్నారు.

Also Read: బాబు పండిపోయాడు…లోకేష్ పచ్చిగానే ఉన్నాడు!

తనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే స్పందించే ఎంపీ రఘురామ కృష్ణంరాజు మంత్రి అవంతి శ్రీనివాస్ విషయంలోను ఇదే విధంగా స్పందించారు. కరోనా ఎవరికైనా వస్తుందనే జ్ఞానామృతాన్ని తెలియజేసినందుకు మంత్రి అవంతిని అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. కర్నూలులో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నప్పుడు తీసుకువెళ్లడంతో కిషోర్ కరోనా బారిన పడ్డారు.. కాబట్టి ఇది ముమ్మాటికి పోలీసు హత్యేనని మరో సారి చెప్పారు. జగన్ ఇమేజ్ తోపాటు తన ఇమేజ్ తో కూడా గెలిచానని ఇప్పటికే పలుమార్లు చెప్పానని ఈ విషయాన్ని గమనిస్తే మంచిదన్నారు. మంత్రి అవంతిలా తాను కేవలం జగన్ ఇమేజ్ తోనే గెలవలేదని ఎద్దేవ చేశారు. మేజరిటీ ప్రజలు అమరావతి రాజధానినే కోరుకుంటున్నారనే విషయాన్ని అవంతి గుర్తించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమాధానం ఇచ్చారు. ఎంపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీకి అవంతి శ్రీనివాస్ చర్య తలనొప్పిగా మారనుందా అనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతుంది.