https://oktelugu.com/

నెంబర్ వన్ స్టార్ గా అవతరించిన సొనూసుద్..!

ప్రపంచమంతా కరోనాకు ముందు కరోనా తర్వాత అనేలా మారింది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తుంది. కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా.. జనజీవనం స్తంభించిపోయింది. భారత్ లోనూ కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ మూలంగా పేద.. మధ్యతరగతి.. వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. లాక్డౌన్ సమయంలో వీరి బాధలు వర్ణణాతీతం. సామాన్యులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సైతం మిన్నకుండిపోగా సొసూసుద్ నేనున్నంటూ ముందుకొచ్చి సాయం అందించాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 03:39 PM IST
    Follow us on

    ప్రపంచమంతా కరోనాకు ముందు కరోనా తర్వాత అనేలా మారింది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తుంది. కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా.. జనజీవనం స్తంభించిపోయింది. భారత్ లోనూ కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది.

    కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ మూలంగా పేద.. మధ్యతరగతి.. వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. లాక్డౌన్ సమయంలో వీరి బాధలు వర్ణణాతీతం. సామాన్యులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సైతం మిన్నకుండిపోగా సొసూసుద్ నేనున్నంటూ ముందుకొచ్చి సాయం అందించాడు. ప్రధానంగా వలస కార్మికులను సొంతూళ్లకు తరలించి వారిపాలిట దైవంగా మారాడు.

    దేశంలో ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులు పూర్తి ఎత్తివేసిప్పటికీ సొనూసుద్ ఇంకా సాయం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలను సెలబ్రెటీలతోపాటు.. నెటిజిన్లు కొనియాడారు. ఈక్రమంలోనే అతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంఖ్య విపరీతంగా పెరిగింది.

    కరోనా సమయంలో రియల్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న సోనూసుద్ కు చాలా మంది అభిమానులుగా మారారు. ఈక్రమంలోనే ఆయన ట్వీటర్ ఫాలోయింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా అనలిటిక్స్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ అత్యధిక ఫాలోవర్స్ కలిగిన జాబితాలో సోనూసుద్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

    ట్వీటర్లో మోదీ మొదటి స్థానంలో ఉండగా రాహుల్ గాంధీ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ స్టార్ ను సైతం వెనక్కి నెట్టి సొనూసుద్ ట్వీటర్లో నెంబర్ వన్ స్టార్ గా ఎదగడం విశేషం. కరోనాకు ముందు సొనూసుద్ రేంజ్ కు ఇప్పడు ఆయన రేంజ్ కు చాలా తేడా ఉందని టాక్ విన్పిస్తోంది.