https://oktelugu.com/

7G Movie OTT: 7/జీ బృందావనకాలని హీరోయిన్ నటించిన హారర్ థ్రిల్లర్ ఓటీటీలో… డోంట్ మిస్! ఎక్కడ చూడొచ్చు!

అప్పట్లో 7/జీ బృందావనకాలని మూవీ ఎంత పెద్ద సంచనలమో తెలిసిందే. ఆ చిత్ర హీరోయిన్ సోనియా అగర్వాల్ కి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిపడింది. ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అది ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం...

Written By:
  • S Reddy
  • , Updated On : August 8, 2024 / 04:22 PM IST

    7G Movie OTT

    Follow us on

    7G Movie OTT: హారర్ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. భయంగా, ఉత్కంఠ భరితంగా సాగే చిత్రాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అందుకే హారర్ జోనర్ లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. పైగా ఓటీటీలో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఏ లాంగ్వేజ్ లో వచ్చిన దెయ్యం సినిమాలైనా ఓటీటీ ప్రియులు వదలకుండా చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ లిమిటెడ్ కంటెంట్ సిద్ధంగా ఉంది. లెక్కకు మించిన హారర్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. తాజాగా 7/జి అనే హారర్ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

    7/జి బృందావన్ కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేసింది. ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ మూవీ పేరు 7/జి అని పెట్టారు. జూలై నెలలో విడుదలైన 7/జి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా త్వరలో విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీ కోసం సోనియా అగర్వాల్ తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    7/జి మూవీ కథ విషయానికి వస్తే .. భార్య వర్ష(స్మృతి వెంకట్) కలను నెరవేరుస్తూ రాజీవ్ సొంతంగా అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ తీసుకుంటారు. 7/జీ అనే ఫ్లాట్ లో అడుగుపెడతారు. గృహప్రవేశం జరిగిన మరుసటి రోజు రాజీవ్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళతాడు. దాంతో కొత్తింట్లో వర్షకు కష్టాలు మొదలవుతాయి. ఆ ఇంట్లో వర్ష తన కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఆ ఇంట్లో వర్ష కి ఏవేవో వింత అనుభవాలు ఎదురవుతాయి. వర్ష భయాందోళనకు గురి అవుతుంది. వారితో పాటు ఆ ఇంట్లో దెయ్యం కూడా ఉందని వర్ష కి అర్థమవుతుంది. ఆ దెయ్యం నుండి ఎలా తప్పించుకోవాలని కంగారుపడుతుంది.

    వర్ష కంటే ముందు ఆ ఇంట్లో ఉన్న మంజుల(సోనియా అగర్వాల్) చనిపోయి దెయ్యంగా మారుతుంది. అసలు మంజుల ఎవరు? ఆమె చావుకు కారణం ఎవరు? ఎలా చనిపోయింది? మంజుల పగ ఎవరిమీద? దెయ్యం నుండి తన కొడుకును వర్ష ఎలా కాపాడుకుంది? అనేది ఈ సినిమా కథ. అయితే రెగ్యులర్ హారర్ చిత్రాల మాదిరి కథ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. 7/జి మూవీ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా వెనుకబడి పోయింది. చూడాలి మరి ఓటీటీలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో. అయితే సోనియా అగర్వాల్ అభిమానులు ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. తెలుగులో ఆమె చిత్రాలు వచ్చి చాలా కాలం అవుతుంది. తమిళంలో విడుదలైన 7/జి చిత్రాన్ని ఆహా తెలుగులో అందుబాటులోకి తెస్తుంది.

    సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 7/జి మూవీ డ్రీం హౌస్ పతాకంపై రూపొందించబడింది. హరూన్ దర్శకత్వం వహించారు. స్మృతి వెంకట్, సిద్దార్థ్ విపిన్ కీలక పాత్రలు పోషించారు. హీరోగా నటించిన సిద్దార్థ్ విపిన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం విశేషం.