https://oktelugu.com/

Sobhita Dhulipala: సమంత కంటే హాట్.. నాగచైతన్య చేసుకోబోయే శోభిత దూళిపాళ బ్యాక్ గ్రౌండ్ ఇదే

నాగ చైతన్య హీరోగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు...ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూనే తన పర్సనల్ లైఫ్ మీద కూడా ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది... సమంత నుంచి విడిపోయాక ఆయన కొంత వరకు డిప్రెషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 04:05 PM IST

    Sobhita Dhulipala

    Follow us on

    Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య సమంత చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకొని 2017 లో పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాల పాటు చాలా బాగా సాగిన వాళ్ల వైవాహిక జీవితంలో అనుకొని సంఘటనలు ఎదురయ్యాయి.. ఇక వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు తలెత్తడం తో ఇద్దరు డివోర్స్ తీసుకొని విడిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం నాగచైతన్య తన సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. అలాగే సమంత కూడా బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి సినిమాలను, సిరీస్ లను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అనే విషయాల మీద అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. నాగ చైతన్య చెప్పిన కూడా సమంత వినకుండా ‘ఫ్యామిలీ మాన్’ అనే సిరీస్ లో ఇంటిమేట్ సీన్లలో నటించిందట. దానివల్ల హర్ట్ అయిన నాగ చైతన్య ఆమెకి డివోర్స్ ఇచ్చాడంటు ఒక వార్త వైరలైంది. ఇంక దాంతోపాటుగా వీళ్ళిద్దరి మధ్య వేరే పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటూ మరొక వార్త కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది. ఇక మొత్తానికైతే చాలాకాలం పాటు కలిసి ఉంటారు అనుకున్న ఈ జంట చాలా తొందర గానే విడిపోవడం అనేది అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ఈరోజు శోభిత ధూళి పాళ తో నాగ చైతన్య కి ఎంగేజ్మెంట్ అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే.. ఇక స్వతహాగా శోభిత హీరోయిన్ కావడం అందులోనూ హాట్ సీన్స్ లో నటిస్తుండడం ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూశాం…ఇక వీళ్లిద్దరూ గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియా లో వినిపించినప్పటికీ అవి నిజమా కదా అనే దాని మీద ఏ ఒక్కరు స్పష్టత ఇవ్వలేదు. అయితే వీళ్ళు చాలా సార్లు ఫారాన్ ట్రిప్ కి కలిసి వెళ్లి అక్కడ మీడియా కి చిక్కారు.

    కానీ దాని మీద వీళ్లిద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం విశేషం… కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చారు… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నాగచైతన్య సమంత బికినీ వేసుకుందని, ఇంటిమేట్ సీన్లలో నటించిందనే కారణంతో ఆమెకి విడాకులు ఇచ్చాడని ఒక వార్త అయితే నానుడిలో ఉంది. మరి ఆ విషయానికి వస్తే శోభితా ధూళి పాళ సమంత కంటే ఎక్కువ ఇంటిమేట్ సీన్లలో నటిస్తూనే బికినీ వేసుకొని కూడా నటించింది…

    ఇక హిందీలో వచ్చిన రమన్ రాఘవ్ 2.0 సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన శోభితా ‘మేడిన్ హెవెన్’ అనే ఒక బోల్డ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులందరికీ తనవైపు తిప్పుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ది మంకీ మ్యాన్ సినిమాలో కూడా నటించి ఎక్స్పోజింగ్ చేసిన విషయం మనకు తెలిసిందే…

    ఇక ఇదిలా ఉంటే సమంత గ్లామర్ షో తో పోలిస్తే శోభిత ధూళి పాళ చేసిన గ్లామర్ షో చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి… మరి బికినీలో నటించిన సమంత కే విడాకులు విచ్చిన నాగచైతన్య ఇక బోల్డ్ సీన్స్ లో నటించిన శోభిత ధూళి పాళ ని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు అనేది కూడా ఇప్పుడు అందరికీ అసక్తి ని కలిగిస్తుంది…

    ఇక ఇదిలా ఉంటే శోభిత ధూళి పాళ తెనాలికి చెందిన అమ్మాయి.. 1992 సంవత్సరంలో మే 31 వ తేదీన ఆమె తెనాలి లో జన్మించింది. తండ్రి వేణు గోపాలరావు ఒక నీవి ఇంజనీర్, అలాగే తల్లి శాంతా కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్… ఇక శోభిత కి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ విశాఖపట్నం నుంచి ముంబైకి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. ఇక తను భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డాన్స్ నేర్చుకొని ఎలాగైనా సరే ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణించాలనే ఉద్దేశ్యంతో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టింది…