https://oktelugu.com/

Sonia Agarwal: మాజీ భర్తతో ఆ పనిచేయడం తనకు ఇష్టమే అంటున్న హీరోయిన్…

ధనుష్ సరసన కాదల్ కొండేన్, పుదుపేట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన కాలనీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సోనియా అగర్వాల్. ఇక ఈ మూడు సినిమాలకు కూడా దర్శకుడు ఒక్కరే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 13, 2024 / 01:57 PM IST

    Sonia Agarwal

    Follow us on

    Sonia Agarwal: హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె పేరు వినగానే ముందుగా చాలా మందికి 7/జీ బృందావన కాలనీ అనే సినిమా గుర్తు వస్తుంది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకొని పోవడంతో..భారీ పాపులారిటీని సంపాదించుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా కంటే ముందు ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమా మాత్రమే తనకు ఎక్కువ పేరును సంపాదించి పెట్టింది.

    ఇక ధనుష్ సరసన కాదల్ కొండేన్, పుదుపేట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన కాలనీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సోనియా అగర్వాల్. ఇక ఈ మూడు సినిమాలకు కూడా దర్శకుడు ఒక్కరే. ఆయనే సెల్వరాఘవన్. ఆ సమయంలో సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని విబేధాల వల్ల ఇద్దరు కూడా విడిపోయారు.

    ఆ తర్వాత ఎవరి వృత్తి పరంగా వారు బిజీగా అయ్యారు. ఇక వీరు విడిపోయిన తర్వాత ఇద్దరికి కూడా సరైన హిట్స్ లేకపోవడం ఆశ్చర్యకరం. ఇక నటుడిగా అవతారం ఎత్తిన సెల్వరాఘవన్ తాజాగా ఆ వృత్తికి పులిస్టాప్ పెట్టి ప్రస్తుతం మళ్లీ డైరెక్టర్ గా హిట్ లను కొట్టాలని చూస్తున్నారు. అయితే తను ఆదిలోనే సంచలన విజయం సాధించిన 7/జీ బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ దిశలో ఉంది. ఇక ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సినిమా పుదుపేట్టై.

    పుదుపేట్టై సినిమాకు కూడా సీక్వెల్ తెరకెక్కిస్తున్నామని ప్రకటించారు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందట. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తే.. సోనియా అగర్వాల్, స్నేహ హీరోయిన్ లుగా నటించారు. దీంతో సీక్వెల్ 2లో కూడా వీరే నటిస్తారా అంటూ అడుగుతున్నారు నెటిజన్లు. ఈ విషయంపై సోనియా అగర్వాల్ స్పందిస్తూ.. సెల్వరాఘవన్ తో కలిసి పనిచేయడం పట్ల తనకు ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిపింది ఈ నటి. ఈ సినిమాలో నటించడం తనకు ఇష్టమే అని చెప్పింది. మరి ఈ సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి.