Sonali Bendre comments : మన తెలుగు లో ఆమె చేసిన సినిమాలు కొన్ని మాత్రమే. కానీ చేసిన ప్రతీ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టాయి. కానీ బాలీవుడ్ లో ఈమె ఒక టాప్ స్టార్ హీరోయిన్. సల్మాన్ ఖాన్(Salman Khan) నుండి హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు ప్రతీ అగ్ర హీరోతో కలిసి ఆమె నటించింది. ఆమె మరెవరో కాదు సోనాలి బింద్రే(Sonali Bendre). తెలుగు లో ఈమె మెగాస్టార్ చిరంజీవి తో ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా MBBS’, బాలకృష్ణ తో ‘పలనాటి బ్రహ్మనాయుడు’, నాగార్జున తో ‘మన్మథుడు’ వంటి చిత్రాలు చేసింది. ఇవి కాకుండా మహేష్ బాబు తో ‘మురారి’, శ్రీకాంత్ తో ‘ఖడ్గం’ వంటి చిత్రాలు చేసింది. వీటిల్లో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రం తప్ప, మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా సెన్సేషన్ సృష్టించాయి. అయితే రీసెంట్ గా సోనాలి బింద్రే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆమె మాట్లాడుతూ ‘ సల్మాన్ ఖాన్ తో నేను 1999 సంవత్సరం లో ‘హమ్ సాత్ హై’ చిత్రం లో నటించాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. ఆయన చేసినప్పుడల్లా నాకు పిచ్చి కోపం వచ్చేది. కేవలం ఆ కారణం చేతనే సల్మాన్ అప్పట్లో నాకు అసలు నచ్చేవాడు కాదు. సెట్స్ లో ఉన్నన్ని రోజులు మేము పోట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. క్లోజప్ షాట్స్ పెట్టినప్పుడు ఆయన ముఖం అదోలా పెట్టేవాడు. అసలు నాతో నీకున్న సమస్య ఏంటి?, ఎందుకు నావైపు అలా చూస్తున్నావ్ అని తిట్టాలని అనిపించేది. అప్పుడప్పుడు కొట్టాలని కూడా అనిపించేది. కానీ అలా చేయలేకపోయాను. అయితే సల్మాన్ ఖాన్ పైకి గంభీరంగా కనిపిస్తాడు కానీ, మనిషి చాలా మంచివాడని ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడే అర్థమైంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : చిరంజీవి ని చూసి భయపడి రాత్రంతా నిద్రపోలేదు అంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
సల్మాన్ ఖాన్ అందరికీ అర్థం అవ్వడం కష్టం, చాలా సమయం పడుతుంది. చాలా సున్నితమైన మనసు గల మనిషి ఆయన అంటూ సోనాలి బింద్రే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ వచ్చిన సోనాలి బింద్రే , క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి సాధారణ గృహిణి లాగా జీవితాన్ని కొనసాగిస్తుంది కానీ, మంచి పాత్రలు దొరికితే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. సినిమాలకు ఈమె దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది. 5 పదుల వయస్సు వచ్చినప్పటికీ ఆమె హీరోయిన్ లుక్స్ తో కొనసాగడం అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం.