Bigg Boss 9 Starts Soon : స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్(Bigg Boss) సరికొత్త సీజన్స్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 8 సీజన్స్ ప్రసారమైతే ఆరవ సీజన్ తప్ప అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ 8 వ సీజన్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది కానీ నాగార్జున(Akkineni Nagarjuna) హోస్టింగ్ కారణంగా అవ్వలేకపోయిందని విశ్లేషకుల అభిప్రాయం. అది కాసేపు పక్కన పెడితే ఈ సీజన్ కి హోస్ట్ మారిపోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తాడని టాక్. ప్రతీ ఏడాది సరికొత్త సీజన్ సెప్టెంబర్ నెలలో మొదలు అయ్యేది. కానీ ఈసారి ఆగష్టు నెలలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.
అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీమ్స్ గా ఏర్పాట్లు చేసి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారట బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టీం. టీమ్స్ అనగా టెక్నికల్ గా పని చేసేవారని అర్థం. పీసీఆర్ రూమ్ లో కెమెరాలను ఎలా ఆపరేట్ చేయాలి?, లాంగ్ షాట్స్, క్లోజప్ షాట్స్ ని ఎలా మ్యానేజ్ చేయాలి?, ఎడిటింగ్ ఎలా చెయ్యాలి?, టాస్కులు ఎలా నిర్వహించాలి వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తారట. సాధారణంగా ఇలాంటి ట్రైనింగ్ క్యాంపులను జులై నెలలో నిర్వహిస్తారట. కానీ ఇప్పుడు జూన్ నెలలోనే మొదలు పెట్టడం తో ఈ సీజన్ సెప్టెంబర్ కంటే ముందే టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. వచ్చే నెల నుండి కంటెస్టెంట్స్ ఎంపిక కూడా మొదలు కాబోతుంది. కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ పద్దతిలో తీసుకుంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!
ఆ ఇంటర్వ్యూస్ ని జులై నెలలోనే మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ ఆగష్టు నెలలో ఉంటుంది. కానీ ఇప్పుడు ముందుగానే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ బాయ్స్..కిలాడీ గర్ల్స్’ సీజన్ 2 విజయవంతంగా నడుస్తుంది. ప్రతీ శని,ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో మరో రెండు వారాల్లో ముగియనుంది. గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ షో పూర్తి అయిన వెంటనే కిచెన్ షో మొదలు కానుంది. ఈ షో కూడా పూర్తి అయ్యాకనే ‘బిగ్ బాస్ 9 ‘ మొదలు కాబోతుంది. అన్ని సీజన్స్ లాగా కాకుండా ఈ సీజన్ ని చాలా కొత్త పద్దతి లో నిర్వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ కూడా ఉంటారట కానీ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఈసారి ఉండకపోవచ్చని అంటున్నారు.