Son Of India Movie Collections: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ కలెక్షన్లు చూసాకా, ఇక ఆయనకు ఆ బిరుదు సరిపోదు అని వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ‘సన్నాఫ్ ఇండియా’కి కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. సినిమాను 353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద కనీస గౌరవప్రదమైన కలెక్షన్స్ కూడా రాలేదు.

ఓపెనింగ్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 2-3% వరకు మాత్రమే ఉంది. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది.
Also Read: ‘వీరసింహారెడ్డి’గా బాలయ్య.. కారణం సెంటిమెంటేనా ?
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 11 లక్షల రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వస్తే.. సెకండ్ రోజు 10.8 లక్షలను ఈ చిత్రం రాబట్టింది. ఇక ౩వ రోజు 3 లక్షలు వచ్చాయి. ఇక 4వ రోజు కలెక్షన్స్ ను బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. చాలా చోట్ల ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదు.

ఇక 4వ రోజు బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం 4 రోజు కలెక్షన్లు ఇలా ఉండే అవకాశం ఉంది 6 లక్షలు. ఇక 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..
నైజాం 60 వేలు ,
సీడెడ్ 45 వేలు,
ఆంధ్రా : 36 వేలు,
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 30 వేలు,
ఓవరాల్ గా మొత్తం 5 రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా గట్టిగా 35 లక్షలను కూడా దాటలేకపోయింది ఈ చిత్రం. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే కాదు, ఈ మధ్య కాలంలో తెలుగు తెర పై కూడా ఇది బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా సగర్వంగా నిలిచింది.
Also Read: సినిమా టికెట్ల వ్యవహారం: జగన్ ను ఆ ఒక్కమాటతో కడిగేసిన పవన్ కళ్యాణ్