Prakash Raj With KCR: రాజకీయాల్లో గండర గండుడు అయిన కేసీఆర్.. ఏ పని చేసినా కొంత ట్విస్ట్ అనేది ఉంటుంది. అంతిమంగా ఆ పని ఫలితం వచ్చే దాకా.. ఆ ట్విస్ట్ ఎవరికీ అర్థం కాదు. ఇప్పటికే ఆయన ఇలా ఎన్నో విషయాల్లో తనదైన మార్కును చూపించి అప్పటికప్పుడు ఫలితాల రూపు రేఖలను మార్చేశారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ అయిదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇందులో భాగంగా నిన్న ముంబై వెళ్లి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసి వచ్చారు. అయితే వీరు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారన్నది బహిరంగ రహస్యమే. వీరి మీటింగ్ మొత్తం బీజేపీకి యాంటీగా జరిగిందన్నది తెలిసిందే. అయితే కేసీఆర్ టీమ్‌లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఉండటమే అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలు కేసీఆర్ టీమ్‌లో ఆయన ఎందుకు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read: పవన్ మేనియా.. ఇక రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురే
గతంలో కేసీఆర్ కర్ణాటక వెళ్లి దేవెగౌడను కలిసినప్పుడు ప్రకాశ్ రాజ్ ఆయన వెంట ఉన్నారు. అప్పుడు ప్రకాశ్ రాజ్‌ది కర్ణాటకనే కాబట్టి ఆయన ఉన్నా పెద్దగా చర్చ జరగలేదు. ఇక కర్ణాటకలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక మా ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూశారు. ఆయన యాక్టివ్ రాజకీయాల్లో లేరు. పైగా ముంబైలో ఆయనకు ఎలాంటి పలుకుబడి లేదు. మరి కేసీఆర్ ఆయన్ను ఎందుకు వెంటబెట్టుకుని వెళ్లాడన్నదే అందరి అనుమానం.
ప్రకాశ్ రాజ్ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమే. ఆయన ఎక్కువగా సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. అంతే గానీ ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. ఇక శరద్ పవార్‌ను కలిసిన సమయంలోన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ వెంటే ఉన్నారు. పైగా ఆయన పక్కనే ఉంచుకున్నారు. ఈ మీటింగ్ లో కేసీఆర్ సైన్యం మాత్రమే కనిపించింది. అంతేగానీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. ఎంపీ సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవిత కే కేశవరావు లాంటి కేసీఆర్ కు నమ్మకమైన వారు మాత్రమే వెళ్లారు.
మరి ఇలాంటి మీటింగ్‌కు ప్రకాశ్ రాజ్ ఎందుకు వెళ్లాడన్నది అర్థం కాదు. గులాబీ బాస్ ప్లాన్ ఏదైనా ముందుగా ఎవరికీ తెలియనివ్వరు. అంతిమంగా ఫలితం వచ్చేదాకా దాన్ని రహస్యంగానే ఉంచుతారు. మరి ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుందేమో అని అంటున్నారు విశ్లేషకులు. ఎంతైనా కేసీఆర్ రూటే సెపరేటు.
Also Read: సినిమా టికెట్ల వ్యవహారం: జగన్ ను ఆ ఒక్కమాటతో కడిగేసిన పవన్ కళ్యాణ్