https://oktelugu.com/

Power Star Pawan Kalyan: పవన్ మేనియా.. ఇక రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురే

Power Star Pawan Kalyan: తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ పవన్ మేనియా టాలీవుడ్ మొత్తాన్ని కమ్మేసింది. సిల్వర్ స్క్రీన్స్ పై మ్యాజిక్ చేయడానికి భీమ్లా నాయక్ హడావిడీ పీక్స్ కు వెళ్ళింది. ఇప్పటికే థియేటర్స్ అన్నీ ‘భీమ్లా నాయక్’ కోసం బుక్ చేసి ఉంచారు. అందుకే, పవన్ మేనియాతో ఇంతకూ ముందు రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు అయిపోవడం ఖాయం అంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ మార్కెట్ లోనూ.. ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల […]

Written By:
  • Shiva
  • , Updated On : February 21, 2022 / 10:18 AM IST
    Follow us on

    Power Star Pawan Kalyan: తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ పవన్ మేనియా టాలీవుడ్ మొత్తాన్ని కమ్మేసింది. సిల్వర్ స్క్రీన్స్ పై మ్యాజిక్ చేయడానికి భీమ్లా నాయక్ హడావిడీ పీక్స్ కు వెళ్ళింది. ఇప్పటికే థియేటర్స్ అన్నీ ‘భీమ్లా నాయక్’ కోసం బుక్ చేసి ఉంచారు. అందుకే, పవన్ మేనియాతో ఇంతకూ ముందు రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు అయిపోవడం ఖాయం అంటున్నారు.

    Pawan Kalyan Bheemla Nayak

    ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ మార్కెట్ లోనూ.. ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల కేకలను భారీ స్థాయిలో పెట్టించేలా ఉన్నాడు. అందుకే, అదే రోజు రిలీజ్ కి సిద్ధం అయిన వరుణ్ తేజ్ ‘గని’, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పిసి524, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లాంటి సినిమాలన్నీ రిస్క్ తీసుకోకుండా మరో డేట్ కు వెళ్లిపోయాయి.

    Also Read: సినిమా టికెట్ల వ్యవహారం: జగన్ ను ఆ ఒక్కమాటతో కడిగేసిన పవన్ కళ్యాణ్

    నిజానికి ఫిబ్రవరి 25కి వస్తామని సడెన్ గా భీమ్లానాయక్ ట్రాక్ లోకి వచ్చాడు. దాంతో మిగిలిన సినిమాలు డ్రాప్ ఇవ్వక తప్పలేదు. ఇక ఓటీటీలో కూడా భీమ్లా నాయక్ కి రికార్డు ధర పలికింది. భీమ్లా నాయక్ సినిమాను ఆహాతో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించుకుంది. డిస్నీ హాట్ స్టార్ కు దేశవ్యాప్తంగా పేరుంది. గతంలో పవన్ సినిమాకు ఎన్నడూ లేనంతగా దాదాపు 40 కోట్లు చెల్లించి మరీ స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకుంది.

    Bheemla Nayak Pawan Kalyan

    ఇండస్ట్రీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అసలు పవర్ స్టార్ భీమ్లా నాయక్ పై ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. హై రేంజ్ లో ఉన్న ఆ అంచనాలకు తగ్గట్టు ఈ మూవీ టీజర్ కు, సాంగ్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే థియేటర్స్ లోకి భీమ్లా నాయక్ ఎప్పుడొస్తారా అని కాచుక్కూర్చున్నారు ఫ్యాన్స్.

    ఇప్పటివరకూ ఏ స్టార్ హీరో సినిమాకు రాని విధంగా భీమ్లా నాయక్ కి కలెక్షన్లను ఇవ్వాలని.. బాక్సాఫీస్ వద్ద కరెన్సీ సునామీని సృష్టించాలని పవన్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి దీనిబట్టి బాక్సాఫీస్ బాక్సు ఏ రేంజ్ లో బద్దలు అవుతుందో చూడాలి.

    Also Read: కేసీఆర్ టూర్ సక్సెసా? ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందా?

    Tags