https://oktelugu.com/

విన్నర్, రన్నర్ ని బకరాలను చేసిన సోహెల్

జయాపజయాలు అటుంచితే బిగ్ బాస్ సీజన్ 4 కి ఆర్థికంగా లాభపడించి మాత్రం సోహెల్ అని చెప్పాలి. విన్నర్ అభిజీత్ కి రూ. 25లక్షలు దక్కితే సోహైల్ కి ఏకంగా రూ. 35 లక్షలు అందాయి. టాప్ త్రీ పొజిషన్ కి వెళ్లిన సోహెల్ బిగ్ బాస్ ఆఫర్ చేసిన రూ. 25లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. సోహెల్ కి అదనంగా మరో పదిలక్షలు ఇస్తున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా సోహెల్ […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 03:56 PM IST
    Follow us on


    జయాపజయాలు అటుంచితే బిగ్ బాస్ సీజన్ 4 కి ఆర్థికంగా లాభపడించి మాత్రం సోహెల్ అని చెప్పాలి. విన్నర్ అభిజీత్ కి రూ. 25లక్షలు దక్కితే సోహైల్ కి ఏకంగా రూ. 35 లక్షలు అందాయి. టాప్ త్రీ పొజిషన్ కి వెళ్లిన సోహెల్ బిగ్ బాస్ ఆఫర్ చేసిన రూ. 25లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. సోహెల్ కి అదనంగా మరో పదిలక్షలు ఇస్తున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా సోహెల్ డ్రాప్ కావడం వెనుక పెద్ద కథే నడిచిందనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: చిరుకు దోశ ఛాలెంజ్ విసిరిన చిలిపి సమంత

    ఫైనల్ కి ముందు రోజు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన మెహబూబ్ సైగల ద్వారా సోహెల్ కి హింట్ ఇచ్చాడంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. నీ పోజిషన్ 3.. డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకొని వచ్చేసేయ్… అని అర్థం వచ్చేలా మెహబూబ్ మిత్రుడు సోహెల్ కి వేళ్ళు చూపించాడనే ఆరోపణ గట్టిగా వినిపిస్తుంది. అందుకే తెలివిగా సోహెల్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చాడని అంటున్నారు. పక్కా స్కెచ్ వేసిన సోహెల్, మెహబూబ్ పర్ఫెక్ట్ గా అమలు చేసి లబ్ధిపొందారని అంటున్నారు.

    Also Read: పవన్ డైరెక్టర్ కు త్రివిక్రమ్ వార్నింగ్!

    అఖిల్ ని ప్రాణమిత్రుడు అంటూనే సోహెల్ తన చీటింగ్ గేమ్ ద్వారా మోసం చేసినట్లు అయ్యిందన్న మాట వినిపిస్తుంది. ఇక అభిజీత్ ని తన పెద్దన్నగా, మానసికంగా సపోర్ట్ ఇచ్చిన వాడిగా చెబుతూ, సోహెల్ మూడో స్థానం తెచ్చుకొని కూడా విన్నర్ ప్రైజ్ మనీలో సగం లాగేసుకున్నాడని అంటున్నారు. మరి నిజంగానే మెహబూబ్ చేసిన సైగల ద్వారానే సోహెల్ ఆ నిర్ణయం తీసుకున్నాడో లేదో తెలియదు కానీ, వీరిద్దరూ చీట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అఖిల్, అభిజీత్ లతో మంచి స్నేహం నటిస్తూ వారిద్దరికీ సోహెల్ టోపీ పెట్టాడని అందరూ ఆరోపిస్తున్నారు.టైటిల్ విన్నర్ అభిజీత్, రన్నర్ అఖిల్ మొత్తంగా బకరాలు అయ్యారనేది సోషల్ మీడియా టాక్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్