పట్టువదలని విక్రమార్కుడిలా జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నాడు. ఎలాగైనా సరే తిరుపతి ఎంపీ సీటును బీజేపీ నుంచి దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ ఆల్ రెడీ బీజేపీ ప్రచారం మొదలుపెట్టి దూసుకెళ్తున్న నేపథ్యంలో జనసేనాని పవన్ ఈ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. జనసేన కూడా తిరుపతి సీటును వదలుకోకూడదని పట్టుదలో ఉంది.
Also Read: బెజవాడ వేదికగా వైసీపీలో ఆధిపత్య పోరు
తిరుపతిలో అభ్యర్థి కోసం ఇప్పటికే బీజేపీ-జనసేన కమిటీ వేశాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినా ఆ వ్యక్తి జనసేన గుర్తుపైనే పోటీచేయించాలని పవన్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈనెలాఖరుకు పవన్ ఢిల్లీ వెళుతున్నారు. ఇప్పటికే ఓసారి పవన్ ఢిల్లీ వెళ్లగా రెండు రోజుల పాటు ఢిల్లీ పెద్దలు దర్శన భాగ్యం కలిగించలేదు. పవన్ ను వెయిట్ చేయించారు. తిరుపతిపై కమిటీ వేశారు. ఇప్పుడు మరోసారి పవన్ ఢిల్లీ వెళుతుండడంతో ఈసారి సీటు కోసమేనన్న చర్చ సాగుతోంది. తిరుపతి పోటీపై పవన్ పట్టుదలతో ఉన్నాడని.. బీజేపీకి ఇవ్వవద్దనే కారణంతోనే వెళుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: జగన్ కాపీ కొట్టావ్.. గాలితీసిన సోము వీర్రాజు
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఇంత సడెన్ గా అవన్నీ వదిలి ఢిల్లీ బాట పట్టడం తిరుపతి సీటు కోసమేనని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపుతో బీజేపీ జోష్ మీదుంది. ఏపీలోనూ గెలవాలని ఉబలాటపడుతోంది. ఈ క్రమంలోనే జనసేనను పక్కనపెట్టి తమ అభ్యర్తియే తిరుపతిలో పోటీచేయాలని ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది.
అయితే జీహెచ్ఎంసీలో మద్దతు ఇచ్చిన పవన్ తిరుపతి ఎంపీ సీటు ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని.. సాధించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కు బీజేపీ అధిష్టానం తిరుపతి ఎంపీ సీటు ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్