Anchor Suma : స్టార్ యాంకర్ సుమ కనకాల బుల్లితెర పై ఓ సెన్సేషన్. ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ సుమ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. స్టార్స్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లు, బుల్లితెర షోలలో సుమదే హవా. ఈ మధ్య బుల్లితెర షో లు తగ్గించింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను చిన్న చిన్న వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. గతంలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీడియా వాళ్ళని ఉద్దేశిస్తూ.. స్నాక్స్ భోజనంలా తింటున్నారని వెటకారం చేస్తూ మాట్లాడింది.
సుమ కామెంట్స్ పై మీడియా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో సుమ మీడియాను క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేసింది. దాంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు సుమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ట్రెండింగ్ మేటర్స్ మీద రీల్స్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. తాజాగా సుమ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.
ఉగాది పండుగ సందర్భంగా పులిహోర, పాయసం, గారెలు, తిని పెంచిన బరువుని తగ్గించడం కోసం ఇది ప్రాయశ్చిత్తం అంటూ చెప్పుకొచ్చింది. సదరు వీడియోలో రోప్ మూమెంట్ చేస్తూ తీవ్రంగా కష్టపడుతుంది. సుమ వర్కింగ్ అవుట్ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫన్నీగా .. సుమ గారు ఎలా వస్తాయి అండీ మీకు ఇలాంటి ఐడియాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరి కొంతమంది ఈ నీకు అవసరమా .. ముసలి దానివి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుమ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ నెగిటివ్ కామెంట్స్ పై సుమ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన బబుల్ గమ్ మూవీ గత ఏడాది విడుదలైంది.