Homeఅప్పటి ముచ్చట్లుSobhan Babu: ‘ఆ శోభన్‌బాబు ఇక లేడురా..' అని శోభన్‌ బాబు ఎమోషనలై.....

Sobhan Babu: ‘ఆ శోభన్‌బాబు ఇక లేడురా..’ అని శోభన్‌ బాబు ఎమోషనలై.. !

Sobhan Babu: That Shobhanbabu Is No More

Sobhan Babu: అలనాటి అందాల నటుడు ‘శోభన్ ‌బాబు’ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో అందాల సోగ్గాడుగా శాశ్వతంగా తెలుగు వెండితెర పై నిలిచిపోయారు. అది ఆయన కల. అందుకే, చివరి దశలో ఎన్నో పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఆయన ఏ అవకాశాన్ని అంగీకరించలేదు. నిర్మాతలు బ్లాంక్ చెక్ లు ఇచ్చి.. అధితి పాత్రలు చేయమని ప్రాధేయ పడినా.. ఆయన ఎన్నడూ చలించలేదు.

అయితే, ఇదే విషయం పై దర్శకుడు కోదండరామిరెడ్డికి శోభన్‌ బాబుకు మధ్య ఒక చర్చ జరిగింది. వీరిద్దరూ మంచి స్నేహితులు. అందుకే, వీరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో శోభన్ బాబుతో ప్రతి నటుడు.. ఆ మాటకొస్తే ప్రతి సినిమా వ్యక్తి స్నేహంగా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు.

కానీ శోభన్ బాబు మాత్రం నలుగురు ఐదుగురుతోనే చనువుగా అతి దగ్గరగా ఉండేవారు. ఆ వ్యక్తుల్లో దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా ఒకరు. అందుకే, కోదండరామిరెడ్డి తనకు ఎటువంటి సమస్య వచ్చినా శోభన్‌ బాబును కలిసి తన సమస్య చెప్పుకుని ఆయన సలహా తీసుకునేవాడు. అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. అయినా శోభన్ బాబు మాత్రం మద్రాసులోనే ఉండిపోయారు.

కానీ వీరి మధ్య స్నేహబంధం చెక్కుచెదరలేదు. కోదండరామిరెడ్డి ఎప్పుడు మద్రాసు వెళ్లినా.. మొదట వెళ్ళేది శోభన్ బాబు వద్దకే. అందుకు తగ్గట్టుగానే శోభన్ బాబు కూడా కోదండరామిరెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానిచేవాడు. స్నేహితుడు వచ్చాడని రకరకాల స్వీట్లు చేయించి.. ‘తినవయ్యా.. మేం ఎలాగూ తినలేం, నువైనా తినురా’ అని బలవంతంగా తినిపించేవారట.

ఇక ‘అప్పుడప్పుడన్నా గెస్ట్ రోల్స్ లోనైనా సినిమాల్లో నటించవచ్చుగా ?’ అంటే.. ఒక నిముషం ఆలోచించి.. ‘ఆ శోభన్‌బాబు ఇక లేడురా.. జుట్టు ఊడిపోయింది. వయసు పెరిగి దవడలు జారిపోయాయి. అందుకే సినిమాలకు దూరం అయ్యాను’ అని శోభన్‌బాబు ఎమోషనల్ గా చెప్పేవారట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version