https://oktelugu.com/

Thalapathy Vijay: తల్లిదండ్రుల పైనే కేసు పెట్టిన స్టార్ హీరో !

Thalapathy Vijay: అధికారం అయిన వాళ్ల మధ్య కూడా దూరం పెంచుతుంది. కానీ ఎలాంటి అధికారం రాకుండానే దూరం పెరిగితే… అది బాధే. పైగా నలుగురిలో అవమానమే. ప్రస్తుతం తమిళ నంబర్ వన్ స్టార్ హీరో విజయ్ (Vijay) పరిస్థితి అలాగే ఉంది. సొంత తల్లిదండ్రుల పైనే కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును.. తన తల్లిదండ్రులతో సహా మరో 11 మందిపై కేసు పెట్టాడు విజయ్, ఎందుకు పెట్టాడు అంటే.. తన పేరును రాజకీయ పార్టీ […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2021 / 06:07 PM IST
    Follow us on

    Thalapathy Vijay: అధికారం అయిన వాళ్ల మధ్య కూడా దూరం పెంచుతుంది. కానీ ఎలాంటి అధికారం రాకుండానే దూరం పెరిగితే… అది బాధే. పైగా నలుగురిలో అవమానమే. ప్రస్తుతం తమిళ నంబర్ వన్ స్టార్ హీరో విజయ్ (Vijay) పరిస్థితి అలాగే ఉంది. సొంత తల్లిదండ్రుల పైనే కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును.. తన తల్లిదండ్రులతో సహా మరో 11 మందిపై కేసు పెట్టాడు విజయ్, ఎందుకు పెట్టాడు అంటే.. తన పేరును రాజకీయ పార్టీ కోసం వాడుకుంటున్నారని.

    చాలామందికి ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌’ అనే రాజకీయ పార్టీ ఉన్నట్టు కూడా తెలియదు. కానీ, ఆ పార్టీ ఉంది. గత ఏడాది నవంబర్‌ లోనే పుట్టింది. విజయ్‌ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ ను రాజకీయ పార్టీగా మార్చారు విజయ్ తండ్రి. పైగా కేంద్ర ఎన్నికల సంఘంలో విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పార్టీ అంటూ రిజిస్టర్‌ కూడా చేయించాడు.

    ఇదే విషయాన్ని విజయ్‌ తండ్రి సగర్వంగా చెప్పుకున్నాడు కూడా. అయితే, ఇదంతా విజయ్ కి ఇష్టం లేదు. తన సినిమా కెరీర్ కి నష్టం కాబట్టి.. ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదు అని విజయ్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ కూడా ఇచ్చుకున్నాడు. కానీ విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులే ఉన్నారు.

    తన తండ్రికి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా ఆయన వినలేదు. దాంతో ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్‌ మళ్ళీ ప్రకటిస్తూ.. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం అనే పేరును గానీ, అలాగే రాజకీయ పార్టీ అంటూ ఆ జెండా పై తన ఫొటోను గానీ, వాడుకుంటే వారి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని విజయ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

    కానీ విజయ్‌ తల్లిదండ్రులు మాత్రం.. విజయ్ పేరునే వాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్నారు. పైగా విజయ్‌ ఫ్యాన్స్‌ అనే చెప్పుకునే వారికి సపోర్ట్ చేసి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు విజయ్ తల్లిదండ్రులు అనుమతులు ఇచ్చారు. దీంతో విజయ్ కి కోపం రెట్టింపు అయింది. తనకు సంబంధం లేకుండా తన పేరుతో పొలిటికల్ మీటింగ్స్‌ పెడుతున్నారని అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు. మరి ఈ కేసు చివరకు ఎటు పోతుందో చూడాలి.