Oh My God 2: స్టార్ హీరోకు షాక్.. సినిమాకు బ్రేక్ వేసిన సెన్సార్ బోర్డు

ఓమై గాడ్ 2 అనేది పరవమశివుడి భక్తుడైన కాంతి శరణ్ స్టోరీ. ఒక సాధాణ వ్యక్తి ప్రేమగల తండ్రి , భర్త, ఒకరోజు అతని కొడుకు వివేక్ అనైతికంగా ప్రవర్తిస్తాడు. దీంతో అతనిని పాఠశాల నుంచి తరిమేస్తారు.

Written By: Chai Muchhata, Updated On : August 2, 2023 4:41 pm

Oh My God 2

Follow us on

Oh My God 2: బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలు చేయడం అక్షయ్ కుమార్ కే సాధ్యమవుతుంది. అందుకే చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు అక్షయ్ తో సినిమా తీయాలని ఇంట్రెస్ట్ పెడుతారు. 2012 లో ‘ఓ మైగాడ్’ అనే సినిమలో అక్షయ్ కుమార్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.60 కోట్లతో ఈ సినిమా తీయాగా.. రూ.193 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఈ మధ్య సీక్వెల్ సినిమాలు బాగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఓమై గాడ్ 2ను నిర్మించారు. అరుణ్ బాటియా, విపుల్ డి షా నిర్మాణంలో దీనిని అమిత్ రాయ్ రచించి, డైరెక్షన్ చేశారు. ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. అయితే ఇంతలో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు షాక్ ఇచ్చింది.

ఓమై గాడ్ 2 అనేది పరవమశివుడి భక్తుడైన కాంతి శరణ్ స్టోరీ. ఒక సాధాణ వ్యక్తి ప్రేమగల తండ్రి , భర్త, ఒకరోజు అతని కొడుకు వివేక్ అనైతికంగా ప్రవర్తిస్తాడు. దీంతో అతనిని పాఠశాల నుంచి తరిమేస్తారు. అయితే ఆ తరువాత తన కొడుకుతో ఎవరో తప్పు చేయించారని కాంతిశరణ్ తెలుసుకుంటాడు. దీంతో తన కుటుంబంతో సహా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకుంటాడు. కానీ ఇంతలో ఓ దైవ శక్తి అతనికి సత్యం తెలుపుతుంది. అ తరువాత ఎలాంటి స్టోరీ అనేది తెరమీద చూపిస్తారు.

ఓ మై గాడ్ ఫస్ట్ మూవీలో అక్షయ్ కుమార్ సాధారణ వ్యక్తిలా కనిపించినా.. దేవడిలా కనిపిస్తాడు. కానీ సీక్వెల్ మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తాడు. అయితే శివుడి గెటప్ లో చాలా మార్పులు చేశారని సెన్సార్ బోర్డు చెప్పింది. అంతే కాకుండా మూవీలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయని తెలిపింది. ఇలా 20 సీన్ల వరకు మార్చాలని సెన్సార్ బోర్డు తెలిపింది. ఇందులో ఆడియోతో పాటు వీడియోలు, సాంగ్స్ కూడా ఉన్నాయి.

సుమారు 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకు 20 సీన్లు మళ్లీ తీయాలంటే మాములు విషయం కాదు. దీంతో సెన్సార్ బోర్డు ఇచ్చిన షాక్ కు చిత్ర బృందం కోలుకోలేకపోతుంది. అంతేకాకుండా ఫస్ట్ మూవీ కంటే ఎక్కువ హోప్స్ పెట్టుకొని తీశారు. అయితే సెన్సార్ బోర్డు వారు చెప్పిన సీన్స్ తీసేసి మళ్లీ నిర్మిస్తారా? లేక సినిమాను విడుదల చేయడం ఆపేస్తారా? అనే చర్చ సాగుతోంది.