https://oktelugu.com/

Hero Tarun Marriage: తరుణ్ పెళ్లి… స్వయంగా క్లారిటీ ఇచ్చిన లవర్ బాయ్!

గత రెండు రోజులుగా తరుణ్ పెళ్లి అంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది. బడా కుటుంబానికి చెందిన అమ్మాయిని తరుణ్ పెళ్లాడబోతున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తరుణ్ స్వయంగా స్పందించారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 2, 2023 / 04:36 PM IST

    Hero Tarun Marriage

    Follow us on

    Hero Tarun Marriage: లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ని షేక్ చేశాడు తరుణ్. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వే కావాలి చిత్రంతో హీరో అయ్యాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా విడుదలైన నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ దెబ్బతో తరుణ్ కి ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి హిట్స్ తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. బిగినింగ్ లో సంచలనాలు చేసిన తరుణ్ కెరీర్ మెల్లగా డల్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఫేడ్ అవుట్ హీరో. సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది.

    గత రెండు రోజులుగా తరుణ్ పెళ్లి అంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది. బడా కుటుంబానికి చెందిన అమ్మాయిని తరుణ్ పెళ్లాడబోతున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తరుణ్ స్వయంగా స్పందించారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. అలాంటి గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే నేనే నేరుగా లేదా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఫలానా వ్యక్తితో నా వివాహం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చేశారు.

    దీంతో గందరగోళానికి తెరపడింది. తరుణ్ పెళ్లిపై స్పష్టత వచ్చింది. కాగా తరుణ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ని ప్రేమించాడనే పుకారు ఉంది. తరుణ్ ప్రేమను ఆర్తి అగర్వాల్ పేరెంట్స్ ఒప్పుకోలేదట. ఈ విషయంలో పెద్ద వివాదమే నడిచినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆర్తి అగర్వాల్ 2015లో అనారోగ్యంతో మరణించింది.మరోవైపు తరుణ్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒకటి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు.

    తరుణ్ తల్లి రోజారమణి కూడా ఆర్టిస్ట్. కొన్ని చిత్రాల్లో నటించారు. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. తల్లి నటవారసత్వాని తీసుకుని తరుణ్ నటుడు అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా తరుణ్ సంచలనాలు చేశాడు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. బాలకృష్ణ, రజినీకాంత్ తో పాటు పలువురు టాప్ హీరోల చిత్రాల్లో నటించారు.