Homeఎడ్యుకేషన్ITBP Recrutement 2025: 133 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు విధానం.. గడువు వివరాలు ఇవీ!

ITBP Recrutement 2025: 133 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు విధానం.. గడువు వివరాలు ఇవీ!

ITBP Recrutement 2025: కేంద్ర ప్రభుత్వం(Central Government) వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు ఊరటనిస్తోంది. ఇప్పటికే పోస్టల్, రైల్వే గ్రూప్‌–డి, తర్వాత వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ఐటీబీపీ (ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌)లో కానిస్టేబుల్‌ పోస్టుల నోటిపికేషన్‌ ఇచ్చింది.

Also Read: పోస్టుమార్టం: బీజేపీ అంజిరెడ్డి ఎందుకు గెలిచాడు.. కాంగ్రెస్‌ నరేందర్‌ రెడ్డి ఎందుకు ఓడాడు?

పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నవారికి కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది ఇండో–టిబెట్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(Indo Tibet Bordar Force)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 133 పోస్టులు భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులు కేవలం స్పోర్ట్స్‌ కోటా కింద మాత్రమే భర్తీ చేస్తారు. ఇది స్పోర్ట్స్‌ కోటా కింది రిక్రూట్‌మెంట్‌ కాబట్టి, క్రీడా అర్హతలు చాలా ముఖ్యం. కచ్చితమైన స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు, షరతులు ఉంటాయి.

ఐటీబీపీ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ 2025:
నోటిఫికేషన్‌: ఐటీబీపీ తాజాగా 2025లో స్పోర్ట్స్‌ కోటా(Sports cota) కింద 133 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 4, 2025 నుండి ఏప్రిల్‌ 2, 2025 వరకు స్వీకరించబడతాయి.

ఖాళీల సంఖ్య: 133 (స్పోర్ట్స్‌ కోటా కింద).

అర్హతలు..
విద్య: 10వ తరగతి (మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత.
వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల మధ్య (రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపు ఉంటుంది).
స్పోర్ట్స్‌ అర్హత: జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న అనుభవం లేదా పతకాలు సాధించినవారై ఉండాలి (వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి).
జీతం: రూ. 21,700 – రూ. 69,100 (లెవెల్‌–3, 7వ వేతన సంఘం ప్రకారం).

ఎంపిక ప్రక్రియ…
ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (PET)
ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST)
రాత పరీక్ష
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌
మెడికల్‌ ఎగ్జామినేషన్‌
దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్థులకు రూ. 100/–, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులకు రుసుము మినహాయింపు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్‌ (recruitment.itbpolice.nic.in) ద్వారా అప్లై చేయాలి.

దరఖాస్తు ఎలా చేయాలి:
ఐటీబీపీ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి: recruitment.itbpolice.nic.in.
‘కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) – స్పోర్ట్స్‌ కోటా 2025‘ నోటిఫికేషన్‌ను క్లిక్‌ చేయండి.
రిజిస్ట్రేషన్‌ చేసి, లాగిన్‌ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, విద్యా ధ్రువపత్రాలు) అప్‌లోడ్‌ చేయండి.
రుసుము చెల్లించి, దరఖాస్తును సబ్మిట్‌ చేయండి.
భవిష్యత్తు ఉపయోగం కోసం ప్రింట్‌ఔట్‌ తీసుకోండి.

 

Also Read:  పవన్ ను తిడితే ఎలా.. నష్టమని తెలిసినా ఎందుకలా జగన్!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version