
Payal Rajput: హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’ కి కెరీర్ లోనే పెద్ద క్రేజీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. సినిమాలో ఆమె పాత్ర రాజకీయ నాయకురాలి పాత్ర. సీఎం కుమార్తెగా ఆమె కనిపించబోతుంది. అయితే హీరోయిన్ గా నటిస్తోన్న పాయల్ కి ఈ సైడ్ పాత్ర ఎలా క్రేజీ ఆఫర్ అవుతుంది ? ఇదే డౌట్ పాయల్ కి కూడా వచ్చింది. త్రివిక్రమ్ మహేష్ తో చేస్తోంది ఒక రాజకీయ డ్రామా.
ఈ డ్రామాలో కీలక పాత్రధారి పాయల్ రాజ్ ఫుత్ దేనట. ఆ రకంగా హీరోయిన్ కంటే సినిమాలో ఆమె నిడివి ఎక్కువ. పైగా గతంలో హీరోని ప్రేమించీ విఫలమైన ప్రేయసి పాత్ర ఆమెది. అందుకే, ఆమె పాత్ర సినిమాలోనే కీలకమైనది. ఇక ఇప్పటికే మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఖరారు చేశారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఇప్పుడు పాయల్ రాజ్ పుత్(Payal Rajput) పై రూమర్స్ వస్తున్నాయి. అయితే, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ పాత్రలకు తప్ప, నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తోందో చెప్పలేం. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర లాంటి పాత్ర ఆమెది. మరి ఆ రేంజ్ పాత్రకు ఎక్స్ పోజింగ్ అండ్ బోల్డ్ సీన్స్ తో పైకి వచ్చిన పాయల్ పనికొస్తుందా ?
పైగా ఆమె పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ ను కూడా పలికించలేదు. కాకపొతే అందంలో పాయల్ కి తిరుగులేదు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేస్తోంది, అంతకు మించిన స్థాయిలో బోల్డ్ గా నటిస్తోంది. అయినా ఎంత నటించినా ఉపయోగం ఏముంది లేండి ? స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయిందిగా !
మొదటి సినిమా నుంచి పాయల్ ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే నిలిస్తూ వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆమె ఇంచుమించుగా అలాంటి పాత్రనే చేయబోతుంది. ఎలాగూ, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి పాయల్ రాజ్ ఫుత్ ఎప్పటి నుంచో గ్లామర్ డోస్ ను రోజురోజుకూ పెంచుకుంటూ వసోంది.
మరి మహేష్ సినిమాలోనే ఛాన్స్ వచ్చింది కాబట్టి… తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరి పూర్ణంగా ప్రదర్శిస్తూ స్టార్ డమ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.