Richa Gangopadhyay: పెళ్లయ్యే వరకే సినిమా హీరోయిన్ల హవా సాగుతుంది. ఆ తరువాత ఫ్యామిలీకే అంకితం అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే కొంత మంది భర్త ప్రోత్సాహంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీ వైపు చూడడం లేదు. అయితే సినిమాల్లో ఉన్నన్నాళ్లు తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న భామలు ఎంతో మంది ఉన్నారు. వారు అలా నటించి ఇప్పుడు లేకపోయినా వారి సినిమాలు చూస్తే మాత్రం మనసుకు హాయిగా ఉంటాయి. ఇలా కొన్ని సినిమాల్లోనే నటించినా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటికి సంబంధించిన లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా?
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో రిచా గంగోపాధ్యాయ ఒకరు. రానా ఫస్ట్ టైం హీరోగా నటించిన మూవీ లీడర్. ఇందులో రిచా గంగోపాధ్యాయ మొదటిసారిగా కనిపించి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత మిరపకాయ్ సినిమాలో రవితేజ పక్కన నటించింది. అయితే ఆ తరువాత ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో మరింత ఫేమస్ సాధించింది. వెంకటేశ్ నటించిన నాగవల్లి సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటికీ స్టార్ హీరోయిన్ అయినా రిచా రవితేజతో మరోసారి ‘సారొచ్చారు’లో కనిపించింది. చివరిసారిగా నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమాలో కనిపించింది రిచా.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పాటు ఫ్యామిలీ లైఫ్ కే అంకితమవ్వాలని రిచా గంగోపాధ్యాయ అమెరికాకు చెందిన జోలంగేళ్ల అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికి ఓ పాప. పెళ్లి తరువాత ఎంతో హ్యాపీ జీవితాన్ని అనుభవిస్తున్నానని రిచా చెబుతోంది. అమెకు సంబంధించిన కొన్ని లెటేస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తన పాపతో పాటు భర్తలో ఉన్న ఫొటోలను నెట్లో పెట్టింది.
రిచా గంగోపాధ్యాయ లెటేస్ట్ ఫొటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే సినిమాల్లోని రిచాకు ఇప్పటి రిచా పూర్తిగా మారిపోయింది. కాస్త బొద్దుగా మారిన ఆమెను చూసి రిచా గంగోపాధ్యాయ అని ఎవరూ అనుకోరు. అయితే ఇప్పటికీ అందంగానే ఉన్న ఆమెను చూసి చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. ఏదీ ఏమైనా సినిమాల్లో అలరించిన ఆమె ఇప్పటి ఫొటోలతో పోలుస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి రిచా గంగోపాధ్యాయ మళ్లీ సినిమాల్లోకి వస్తారా? లేదా? చూడాలి.