‘Skanda’ box office collections : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద. రామ్‍కు జంటగా శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా చేశారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూట్ ఊర్వశీ రౌతెలా కల్ట్ మామ స్పెషల్ సాంగ్‍తో ఐటమ్ బాంబ్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‍పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఉస్తాద్ రామ్ పోతినేని స్కంద సినిమాకు సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే స్కందకు ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‍గా స్కంద మూవీకి రూ. 46. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఇది రామ్ కెరీర్‍లోనే ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్ బిజినెస్ అని తెలుస్తోంది.
రామ్ పోతినేని స్కంద మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో రూ. 13 కోట్లు, సీడెడ్‍లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‍లో 19.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా ఏపీ, తెలంగాణలో స్కంద చిత్రానికి రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‍లో 2.20 కోట్ల మార్కెట్ అయింది. అన్ని ఏరియాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా స్కంద సినిమా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా ఫిక్స్ అయింది. అంటే స్కందకు రూ. 47 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ వస్తేనే హిట్‍గా నిలుస్తుంది. ఇదిలా ఉంటే స్కంద సినిమాకు సెప్టెంబర్ 28 విడుదలైన రోజునే 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
అంతేకాదు రెండవ రోజు కలెక్షన్లు రూ. 7 కోట్లకు పైగా రానున్నట్టు తెలుస్తోంది. ప్రీ బుకింగ్స్, ట్రేడ్ వర్గాల అంచనాను బట్టి రెండవ రోజు కలెక్షన్లు భారీగానే వస్తాయని టాక్. మరి చూడాలి రామ్ మొదటి రోజు కలెక్షన్ల మాదిరి రెండవ రోజు కూడా అందుకుంటాడా లేదా అనేది. మొత్తం మీద ఇది రామ్ – బోయపాటి మాస్ మ్యానియా అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఇదే రేంజ్‌లో దూసుకుపోతే రెండవ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏరియాల వారీగా స్కంద రెండవరోజు వసూళ్ల పూర్తి అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.