https://oktelugu.com/

Sitara Kuchipudi Dance: మహేష్ కూతురు సితార కూచూపుడి నాట్యం చేస్తున్న వీడియో చూసారా ?.

Sitara Kuchipudi Dance: సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి వార్త అయినా సరే వారి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక టాలీవుడ్ హీరోలే కాకుండా వారి పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుటుంబాలలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ కూడా ఉంది. ఆయన తన పిల్లలు గౌతమ్, సితార కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 11, 2022 / 11:42 AM IST
    Follow us on

    Sitara Kuchipudi Dance: సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి వార్త అయినా సరే వారి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక టాలీవుడ్ హీరోలే కాకుండా వారి పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుటుంబాలలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ కూడా ఉంది. ఆయన తన పిల్లలు గౌతమ్, సితార కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

    Sitara Kuchipudi Dance

    ముఖ్యంగా ఆయన తన కూతురు సితారకు సంబంధించిన విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సితారతో మహేష్ చేసే అల్లరి, ఇతర వీడియోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తారు. ఆయనే కాదు భార్య నమ్రత కూడా డా సితార వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక తండ్రికి తగ్గ కూతురుగా సితార కూడా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. మహేష్ సినిమాలోని కొన్ని పాటలకు ఆమె స్టెప్పులు వేసిన వీడియోలు ఎంతలా వైరల్ అవుతాయో మనకు తెలిసిందే.

    Also Read: ‘నటరాజ్ మాస్టర్’ ఇంట్రెస్టింగ్ గా కాదు, ఇరిటేటింగ్ గా మారుతున్నాడు !

    సర్కారు వారి పాట మూవీ లోని కళావతి సాంగ్ కు సితార ఎంత క్యూట్ గా స్టెప్పులు వేసిందో మనం చూశాం. ఇక పెన్ని సాంగ్ తో తండ్రి మహేష్ పక్కన స్టెప్పులు వేసింది. సితార చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇలా ఫ్యాషన్ స్టెప్పులతో మాత్రమే కాకుండా.. సంప్రదాయ కూచిపూడి డ్యాన్స్ కూడా అద్భుతంగా చేస్తుందని నిరూపించుకుంది సితార.

    శ్రీరామనవమి సందర్భంగా సితార అద్భుతంగా కూచిపూడి డాన్స్ చేసింది. సంప్రదాయ బట్టల్లో కళ్ళకు కట్టినట్టు కూచిపూడి డ్యాన్స్ తో అబ్బురపరిచింది. శ్రీరాముని విశిష్టతను తెలిపే పాటలో ఆమె అద్భుతంగా కూచిపూడి భంగిమలు వేసింది. ఈ వీడియోను మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇంకేముంది చాలా త్వరగా ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.

    Also Read: మరో సరికొత్త రికార్డు నమోదు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ !

    Tags