Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రమాదంలో పడింది. వరుసగా ఆమెకు ఆరు ప్లాప్స్ పడ్డాయి. ఓ చెత్త రికార్డు పూజా హెగ్డే తన ఖాతాలో వేసుకుంది. రాధే శ్యామ్ మూవీతో మొదలైన ఆమె డౌన్ ఫాల్ కొనసాగుతుంది. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ కనీస అంచనాలు అందుకోలేకపోయింది. తర్వాత చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్యలో నటించారు. ఈ చిత్రం కూడా ఆడలేదు.
బీస్ట్, సర్కస్, ఎఫ్ 3 వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సల్మాన్ ఖాన్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే సల్మాన్ కూడా ఆమెను కాపాడలేకపోయారు. కనీసం వంద కోట్ల మార్క్ కూడా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ చేరుకోలేకపోయింది. పూజా ఖాతాలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మరో ప్లాప్ గా చేరింది. మొత్తంగా ప్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసింది.
పూజా పేరు ఎత్తాలంటే మేకర్స్ భయపడే పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ నిర్మాతలు పూజాను దూరం పెట్టేశారు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పూజా నటించాల్సింది. ఆమెను కాదని శ్రీలీలను తీసుకున్నారు. కోలీవుడ్ లో ఆమెకు పెద్దగా ఫేమ్ లేదు. అక్కడ ఆఫర్స్ వచ్చే సూచనలు లేవు. పూజా చేతిలో అధికారికంగా ఉన్న ఒకే ఒక ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 28. మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ వివాదాల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్, త్రివిక్రమ్ కి పొసగడం లేదట. షూటింగ్ కి డుమ్మా కొట్టి మహేష్ విదేశాలకు చెక్కేశాడట. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆసక్తి మహేష్ కి లేదంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూజా హెగ్డే డిప్రెషన్ కి గురయ్యారట. దాన్ని నుండి బయటపడేందుకు విహారాలు చేయడమే బెటర్ అని భావిస్తున్నారట. పూజా హెగ్డే శ్రీలంక టూర్ కి వెళ్లినట్లు సమాచారం. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ తో ఈ విషయం అర్థం అవుతుంది. ఫ్యాన్స్ మాత్రం భారీ హిట్ తో ఆమె సాలిడ్ హిట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.