Homeఎంటర్టైన్మెంట్Koratala Siva Ignoring NTR: ఎన్టీఆర్ మాటలను పట్టించుకోని కొరటాల శివ.. మళ్ళీ అదే తప్పు...

Koratala Siva Ignoring NTR: ఎన్టీఆర్ మాటలను పట్టించుకోని కొరటాల శివ.. మళ్ళీ అదే తప్పు చెయ్యబోతున్నాడా?

Koratala Siva Ignoring NTR: కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదల అయ్యి భారీ ఫ్లాప్ గా మిగిలిన సంగతి మన అందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ వంటి హీరోలను ఒక్కే సినిమాలో పెట్టుకొని కూడా ఇలాంటి ఔట్పుట్ ఇచ్చినందుకు కొరటాల శివ ని మెగా అభిమానులు మరియు ప్రేక్షకులు ఒక్క రేంజ్ లో విమర్శలు చేసారు..ఆచార్య సినిమా పట్ల కొరటాల శివ దర్శకత్వం మీద పెట్టిన శ్రద్ద కంటే కూడా ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ రిఘ్ట్౫స్ మీద పెట్టిన శ్రద్దనే ఎక్కువ గా ఉండింది అని..చిరంజీవి మరియు రామ్ చరణ్ క్రేజ్ ని క్యాష్ చేసుకొని బయ్యర్లకు భారీ స్థాయి రేట్స్ లో సినిమాని హక్కులను అమ్మేసి వహివారికి చేతులు కాల్చుకున్నాడు అని..స్టోరీ మరియు కంటెంట్ మీద కాకుండా కేవలం హీరోల స్టార్ స్టేటస్ ని మాత్రమే నమ్ముకొని సినిమాలు తీస్తే ఇలాంటి ప్రొడక్ట్స్ బయటకి వస్తాయి అని సినీ విశ్లేషకులు కొరటాల శివ పై పెదవి విరిచారు.

Koratala Siva Ignoring NTR
Ramcharan, Chreanjeevi

ఇది ఇలా ఉండగా ఆచార్య సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తన తదుపరి సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సాధారణంగా ఆచార్య సినిమా చూసిన తర్వాత ఏ స్టార్ హీరో కూడా కొరటాల శివ తో సినిమా చేసే సాహసం చెయ్యరు..కానీ జూనియర్ ఎన్టీఆర్ కేవలం కొరటాల శివ తెచ్చిన స్క్రిప్ట్ అమితంగా నచ్చడం తో హిట్స్ లో ఉన్నాడా, ఫ్లాప్స్ లో ఉన్నాడా అని చూడకుండా కొరటాల శివ ని నమ్మి అవకాశం ఇచాడు..సాధారణంగా చాలా మంది దర్శకులు చెప్పినట్టు సినిమా తియ్యలేరు..పేపర్ మీద ఉన్నది ఉన్నట్టు తీసే దర్శకులు చాలా తక్కువ..కానీ ఆచార్య సినిమాని చూసిన తర్వాత కూడా ఎన్టీఆర్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు అంటే నిజంగా చాలా సాహసం చేసాడు అనే చెప్పాలి..కానీ కొరత శివ మాత్రం ఎన్టీఆర్ చెప్పే మాటలను లెక్క చెయ్యట్లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Koratala Siva Ignoring NTR
Koratala Siva, Tarak

Also Read: Bald Head Drug: బట్టతల ఉందా.. బాధపడకండి జుట్టు వచ్చే మార్గముంది?

ఆచార్య సినిమా లో హీరోయిన్స్ కోసం కొరటాల శివ ఏడాది పైగా సమయం తీసుకొని వేస్ట్ చేసాడు ..కాజల్ అగర్వాల్ ని అనవసరంగా సినిమాలో తీసుకొని మళ్ళీ ఆమె పాత్ర సినిమాకి అడ్డుగా మారింది అని తొలగించాడు..ఇప్పుడు ఎన్టీఆర్ తో చెయ్యబొయ్యే సినిమాలో కూడా అదే తప్పు ని రిపీట్ చేస్తున్నాడు..మన సినిమాకి సాయి పల్లవి మరియు రష్మిక వంటి వారు సరిపోతారు వాళ్ళని తీసుకోండి అని ఎన్టీఆర్ రికమెండ్ చెయ్యగా, కొరటాల శివ మాత్రం ఎచ్చులకు పొయ్యి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కోసం వెంపర్లాడుతున్నాడు..అలియా భట్ మరియు కైరా అద్వానీ వంటి వారిని సంప్రదించగా వాళ్ళు డేట్స్ సర్దుబాటు చెయ్యలేక నో చెప్పారు..కానీ కొరటాల శివ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు..ఇప్పుడు ఆయన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు అని తెలిసింది..కేవలం హీరోయిన్స్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే ఇప్పటి వరుకు షూటింగ్ ప్రారంభం కాలేదు అని..ఆలస్యం అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఎన్టీఆర్ కూడా ఈ విషయం పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read: KCR Third Front: ఫ్రంట్‌ కోసం పట్టు వదలకుండా.. 2024కు కేసీఆర్‌ రోడ్‌మ్యాప్‌!!
Recommended Videos
F3 లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాములుగా లేదు || F3 Movie Public Talk || F3 Movie Review || Venkatesh
కాట్రాజ్ రివ్యూ వింటే నవ్వి నవ్వి చస్తారు || F3 Movie Public Talk || F3 Movie Public Review || F3
సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాడు || F3 Movie Public Talk || F3 Movie Review || Venkatesh

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version