https://oktelugu.com/

Balakrishna: బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఆ యంగ్ డైరెక్టర్ తో చేయడానికి సిద్దం అవుతున్నాడా..?

నందమూరి ఫ్యామిలీ లో బాలయ్య బాబు సాధించిన ఘన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి ఫ్యామిలీ సెకండ్ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా బాలయ్య బాబుకే దక్కుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 15, 2024 / 11:31 AM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: బాలయ్య బాబు కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఆయన సాధించని విజయం లేదు. ఆయన సంపాదించని కీర్తి ప్రతిష్టలు లేవు అనేంతలా బాలయ్య బాబు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను చేస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ‘శ్రీ నందమూరి తారక రామారావు’ గారి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే మాస్ హీరోగా ఎదిగి ప్రేక్షకులందరిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు ఒకప్పుడు చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను కూడా చేశాడు. అందులో ముఖ్యంగా బైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలు ఉండటం విశేషం…ఇక సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చేసిన ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాలయ్య బాబుకి సరికొత్త గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఎంటైర్ కెరియర్ లో ఆయనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఉందట. ప్రస్తుతం దాని మీదనే కొన్ని చర్చలైతే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబు కెరియర్ లో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ని తీయాలని తను ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అలాగే ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టుగా భారీ విజువల్ వండర్ గా ఆ సినిమాను తెరకెక్కించాలని ఆయన చూస్తున్నాడు. అయినప్పటికీ అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.

    ఇక మధ్యలో సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 999’ అనే పేరుతో బాలయ్య బాబుతో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ని చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి అంటే సింగీత శ్రీనివాసరావు ఏజ్ కూడా బాగా పెరిగిపోవడంతో ఆ ప్రాజెక్టు అనేది ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ సినిమాని చేయబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి వార్తలైతే వస్తున్నాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం కమిట్ అయిన కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న తర్వాత బాలయ్య బాబుతో తప్పకుండా ఒక సినిమాను చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అది ఆదిత్య 999 సినిమానే కాబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కథను సింగీతం శ్రీనివాస్ రావు పూర్తి చేసి పెట్టారు.

    కాబట్టి అదే కథతో ఈ సినిమాని తెరకెక్కించే ఆలోచనలో అటు బాలయ్య బాబు, ఇటు ప్రశాంత్ వర్మ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది. బాలయ్య బాబు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఘన విజయాన్ని సాధిస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…