Siundarya Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తాత అయ్యాడు. ఒక కూతురు ఏమో హీరో ధనుష్ తో విడాకులు తీసుకొని వేరుగా ఉంటోంది. మరో కూతురు కూడా ఇలానే విడాకులు తీసుకొని వేరొకరిని రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారిద్దరికీ కలిగిన సంతానమే ఇదీ.

రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఆదివారం ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సౌందర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుడు దయతో మరో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు పేర్కొన్నాడు. ఇక ఆదివారం పుట్టిన సౌందర్య కుమారుడికి రజినీకాంత్ అనే పేరు పెట్టడం విశేషం.
రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. అశ్వినీరామ్ అనే వ్యాపారవేత్తను 2010లో మొదటి వివాహం చేసుకుంది. వీరిద్దరికీ వేద్ కృష్ణ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఏడేళ్ల కాపురం తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. 2019లో సౌందర్య విశాగన్ వనంగమూడి అనే మరో వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుంది. ఆయనకు కూడా ఇది రెండో వివాహమే.
వీరి వివాహం అయిన మూడేళ్ల తర్వాత వీరిద్దరూ మరో కుమారుడికి జన్మనిచ్చారు. రజినీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకురాలిగా కూడా ప్రయత్నం చేశారు. గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. రజినీకాంత్ హీరోగా నటించిన పడయప్ప, బాబా, చంద్రముఖి, శివకాశి, మజా, పందెంకోడి వంటి సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్ గా చేశారు.
రజినీకాంత్ హీరోగా వచ్చిన యానిమేషన్ మూవీ ‘కొచ్చాడయన్’ కు దర్శకత్వం కూడా సౌందర్య వహించారు. తన మాజీ బావ ధనుష్ హీరో వీఐపీ2కి కూడా దర్శకత్వం వహించింది. ఈ సినిమా కూడా ఆడలేదు. దర్శకురాలిగా విఫలమైంది. ఇక సంసార జీవితంలో మునిగితేలుతోంది.