Bimbisara – Sita Ramam: టాలీవుడ్ వరుస పరాజయాలకు నిన్నటితో బ్రేక్ పడిందని మెగాస్టార్ ఒక ట్వీట్ చేస్తూ సగర్వంగా ప్రకటించారు. ప్రేక్షకులు థియేటర్స్ కు రావట్లేదని బాధ పడుతున్న ఇండస్ట్రీకి ఊరట, ఉత్సాహాన్ని ఇస్తూ.. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని ప్రూవ్ చేసిన సీతా రామం, బింబిసార చిత్రాలకు, చిత్ర నటీనటులు, నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.
Also Read: Sita Ramam Collections: ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
`సీతారామం`, `బింబిసార` రెండు చిత్రాలు ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కాకపోతే, ఆ టాక్ కి తగ్గట్టు కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోయాయి. అయితే, ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాలు వచ్చాయి అని, ఒకపక్క సోషల్ మీడియాలో టాక్ అయితే బీభత్సంగా నడుస్తోంది. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు. నిజంగానే ఈ రెండు సినిమాలూ అద్భుతమైన పాజిటివ్ రివ్యూల్ని సంపాదించుకొన్నాయి. ముఖ్యంగా `సీతారామం` సినిమాకి అయితే, క్లాసిక్ అంటూ చాలా గొప్ప రివ్యూలు ఇచ్చారు. ఇక మాస్ ఆడియన్స్ కి `బింబిసార` పెద్ద పండుగ అన్నారు. కానీ, ఆ క్లాసిక్, ఈ పండుగ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. రెండు సినిమాలకు మార్నింగ్ షోలు ఏవరేజ్‌గానే ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ షో అయినా ఫుల్ అవుతుంది అనుకుంటే అదీ లేదు.
Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 2nd డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు
ఐతే, గుడ్డిలో మెల్ల లాగా సెకండ్ షోకి మాత్రం కాస్త బుకింగ్స్ ఊపందుకొన్నాయి. కానీ, ఈ సినిమాలకు వచ్చిన పాజిటివ్ టాక్ స్థాయిలో, ఈ సినిమాలకు కలెక్షన్స్ మాత్రం లేవు. అసలు ఈ రెండు సినిమాల అవుట్ ఫుట్ ప్రకారం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావాలి. కానీ, అలా జరగలేదు. ఏది ఏమైనా పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది పరిస్థితి. ఇంతకీ, ఈ రెండు సినిమాల కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ కలెక్షన్స్ పరిస్థితి 60 ఆక్యుపెన్సీతో ఎబౌవ్ ఏవరేజ్ గా ఉంది. ఇక ‘బింబిసార’ కలెక్షన్స్ పరిస్థితికి వస్తే, 65 ఆక్యుపెన్సీతో ‘సీతా రామం’ కంటే కొంచెం బెటర్ గా ఉంది. కానీ ఓవరాల్ గా పేరు గొప్ప ఊరు దిబ్బలా ఈ సినిమాల పరిస్థితి.