Sita Ramam Heroine Mrunal: ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు మృణాల్ ఠాకూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ సీతగా తెలుగు ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేసింది. దర్శకుడు హను రాఘవపూడి కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీగా సీతారామం తెరకెక్కించాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సీతారామం నిర్మాతలకు, బయ్యర్లకు భారీ లాభాలు పంచింది. ముఖ్యంగా మృణాల్ కి టాలీవుడ్ లో ఈ మూవీ మంచి పునాది వేసింది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్సెస్ పట్టేసిందంటూ కథనాలు వెలువడుతున్నాయి.

టాలీవుడ్ దర్శక నిర్మాతలు మృణాల్ వెనుకబడుతున్నారనేది నిజం. ఒక్క మూవీతో ఈ రేంజ్ పాపులారిటీ అరుదుగా దక్కుతుంది. ఇక సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ సెగలు రేపుతున్నారు. సీతారామం మూవీలో హోమ్లీ అండ్ డీసెంట్ రోల్ చేసిన మృణాల్ తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు. తాజాగా ఆమె టాప్ లెస్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చారు. టాప్ లేకుండా అర్ధనగ్నంగా ఫోటో షూట్ చేసింది. మృణాల్ బోల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మృణాల్ కొత్త అవతారం కుర్రకారును గిలిగింతలు పెడుతుంది. హిందీలో మృణాల్ సూపర్ 30, బాట్లా హౌస్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లో ఆమె వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. మృణాల్ నటించిన హిందీ జెర్సీ మాత్రం నిరాశపరిచింది. నాని హీరోగా నటించిన జెర్సీ చిత్ర రీమేక్ గా అదే టైటిల్ తో జెర్సీ తెరకెక్కించారు. షాహిద్ కపూర్ హీరోగా నటించగా మృణాల్ ఆయనకి జంటగా నటించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న జెర్సీ అనూహ్యంగా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మృణాల్ దాదాపు నాలుగు హిందీ చిత్రాలు చేస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ పెళ్లి, పిల్లలు వంటి పర్సనల్ విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 30 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్ళి ఆడవాళ్లను ఒత్తిడికి గురి చేస్తాయని ఆమె తెలియజేశారు. అలాంటి రిస్క్ నేను తీసుకోవాలి అనుకోవడం లేదు, అన్నారు. పెళ్లి, శృంగారంపై ఆసక్తి లేదు అన్నారు. అయితే పిల్లలు కావాలన్నారు. మృణాల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. సాంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా ఉన్న ఆమె ఆలోచనలు ఫ్యాన్స్ ని అయోమయంలోకి నెట్టివేశాయి. కాగా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ లో మృణాల్ నటించాల్సి ఉండగా… సీతారామం కోసం అంత పెద్ద పాన్ ఇండియా మూవీ వదులుకున్నారట. ఈ విషయం నిర్మాత అశ్వినీ దత్ స్వయంగా చెప్పాడు.
Recommended videos:

