Old Heroes: మన టాలీవుడ్ లో హీరోహీరోయిన్ల వయసులో ఎంతో తేడా ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ శ్రీదేవి జంట అందరిని మురిపించినా బడిపంతులు సినిమాలో శ్రీదేవి మనవరాలిగా నటించింది. కానీ వారి జంట తెలుగు సినిమాల్లో ఓ ట్రెండ్ సృష్టించింది. ఇక ఏఎన్ఆర్ తో భక్తతుకారాం సినిమాలో శ్రీదేవి కూతురుగా నటించింది. హీరోయిన్ గా ఆయనతో కూడా స్టెప్పులేసింది. మన సినిమాల్లో హీరో వయసు ఎంతున్నా హీరోయిన్లు మాత్రం పదేళ్లకు మించి తమ ప్రభావం చూపలేదు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధ, రాధిక వంటి వారు తొంభయవ దశకంలో వారి ప్రభావం చూపినా తరువాత కాలంలో తెరమరుగయ్యారు.

తెలుగు సినిమాల్లో ఎప్పుడు కొత్తవారు వస్తూనే ఉంటారు. పాతవారు ఇళ్లకే పరిమితమవుతూనే ఉన్నారు. దీంతో ఇప్పుడున్న హీరోలతో జతకట్టే హీరోయిన్ల వయసులో భారీ తేడా ఉంటోంది. ఒక్కో హీరో సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు హీరోయిన్లు పుట్టనేలేదంటే అతిశయోక్తి కాదు. మన హీరోలందరు నాలుగు పదులు దాటిన వారే ఉండటం గమనార్హం. కానీ హీరోయిన్ల వయసు మాత్రం అందులో సగంకూడా ఉండటం లేదు. దీంతో వారి మధ్య వయసు వ్యత్యాసం బ్రహ్మాండంగా కనిపిస్తోంది.

Jayaprada, Jayasudha,
కానీ వేరే గత్యంతరం లేదు. హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండలేరు. ప్రస్తుతం ఉన్న వారిలో సమంత, కాజల్ లాంటి వారే సీనియర్లు. ఇక రష్మిక, పూజా హెగ్డే, కియారా అడ్వానీ వంటి వారు హీరోల ఎంట్రీకి వారి వయసు కేవలం పదమూడు సంవత్సరాలు ఉండగా కొందరైతే ఇంకా పుట్టనేలేదంటే ఆశ్చర్యకరమే. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ప్రధానంగా కనిపించడం మామూలే. దీంతో కథానాయికల హవా కేవలం పది సంవత్సరాల వరకే ఉండటం తెలిసిందే.

దాదాపు మనవరాళ్ల వయసున్న వారితో ఆడిపాడటంతో కొంత ఇబ్బంది అనిపించినా సీనియర్ హీరోయిన్లు అందుబాటులో ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా వారిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లేదు. అందుకే వారి ప్రభావం తగ్గడంతో కొత్త వారితోనే జతకడితేనే ప్రేక్షకులు చూస్తారనే అభిప్రాయం అందరిలో వస్తోంది. కథానాయికల వయసు పాతిక దాటిందంటే ఇక వారి హవాకు బ్రేక్ వేయాల్సిందే. ప్రేక్షకులు వారిని ఒప్పుకోవడం లేదు. కొత్త వారితోనే జత కట్టేందుకు హీరోలు కూడా రెడీగా ఉంటున్నారు. హీరోలకు మాత్రం ఎంత వయసు వచ్చినా ఆదరిస్తున్న ప్రేక్షకులు హీరోయిన్ల విషయంలో మాత్రం ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు.
Also Read: RTD IPS AK Khan Son: 90 లక్షల కోసం కక్కుర్తి: మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకు ఇంత మోసగాడా?