https://oktelugu.com/

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సెట్‌లోకి సీత!

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌‌ రాజమౌళి చేతుల మీదుగా మరో చరిత్ర సృష్టించేందుకు తెరమీదకు ఎక్కుతున్న చిత్రం ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌‌ మల్టీస్టారర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇన్ని రోజులు కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. Also Read: షాకిచ్చిన పునర్నవి.. ఇలా చేస్తుందని అనుకోలేదు.! అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ను చూపిస్తూ కరోనాకు ముందే టీజర్‌‌ రిలీజ్‌ చేసిన రాజమౌళి.. ఈనెల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 11:17 AM IST
    Follow us on

    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌‌ రాజమౌళి చేతుల మీదుగా మరో చరిత్ర సృష్టించేందుకు తెరమీదకు ఎక్కుతున్న చిత్రం ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌‌ మల్టీస్టారర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇన్ని రోజులు కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.

    Also Read: షాకిచ్చిన పునర్నవి.. ఇలా చేస్తుందని అనుకోలేదు.!

    అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ను చూపిస్తూ కరోనాకు ముందే టీజర్‌‌ రిలీజ్‌ చేసిన రాజమౌళి.. ఈనెల 22న భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌‌ ను చూపుతూ విడుదల చేసిన టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. తక్కువ టైమ్‌లోనే మిలియన్ లైకులు సాధించిన ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది.

    అయితే.. అంతా బాగానే ఉన్నా టీజర్‌‌ చివర్లో కొమురం భీమ్‌ను ముస్లిం గెటప్‌లో చూపడంపై వివాదం చెలరేగింది. రాజమౌళి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీశారని, సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రాజమౌళి మాత్రం ఈ వివాదాలను పట్టించుకోకుండా తన పని తారు చేసుకుపోతున్నారు. షూటింగ్‌ను శరవేగంగా నడిపిస్తున్నారు.

    Also Read: మనాలిలో నాగార్జున.. ఈ వారం బిగ్ బాస్ హోస్ట్‌ ఎవరు..?

    ఇందులో సీత పాత్రలో నటించనున్న అలియా భట్ త్వరలోనే యూనిట్‌తో జత కలవనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆమె నవంబర్ 2 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీత పాత్ర చిన్నదే అయినప్పటికీ పాన్ ఇండియా కావడంతో అట్రాక్షన్‌ కోసం అలియా భట్‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్‌ జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌తోపాటు హాలీవుడ్‌ నటులు రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడీ తదితరులు నటిస్తున్నారు. సినిమా కూడా ఎప్పుడెప్పుడు షూటింగ్‌ పూర్తిచేసుకొని ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.