https://oktelugu.com/

Jobs: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

Jobs: ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ సంస్థ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 188 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఎంటీ డ్రైవర్‌, కుక్‌, బూట్‌ మేకర్‌/రిపెయిరర్‌, ఎల్‌డీసీ, వెయిటర్‌, ఫాటిగ్యూమెన్‌, ఎంటీఎస్‌, ల్యాబొరేటరీ, అటెండెంట్‌, బార్బర్‌ ఉద్యోగాలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అవుతాయి. ఆఫ్ లైన్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 30, 2021 / 10:17 AM IST
    Follow us on

    Jobs: ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ సంస్థ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 188 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఎంటీ డ్రైవర్‌, కుక్‌, బూట్‌ మేకర్‌/రిపెయిరర్‌, ఎల్‌డీసీ, వెయిటర్‌, ఫాటిగ్యూమెన్‌, ఎంటీఎస్‌, ల్యాబొరేటరీ, అటెండెంట్‌, బార్బర్‌ ఉద్యోగాలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అవుతాయి.

    Jobs

    ఆఫ్ లైన్ లో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పది, ఇంటర్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడులలో నైపుణ్యం, అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

    Also Read: ఐఐటీ తిరుపతిలో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. లక్షకు పైగా వేతనంతో?

    18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించనుండగా అబ్జెక్టివ్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రశ్నలను ఇస్తారు.

    పరీక్ష సమయం రెండు గంటలు కాగా హిందీ, ఇంగ్లీష్ లో పరీక్షను నిర్వహిస్తారు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ లో ప్రకటన రిలీజైన 45 రోజుల్లోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.

    Also Read: భారత ప్రభుత్వ మింట్‌ లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.90 వేల వేతనంతో?