SiriVennela: ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. ఆయన ఆరోగ్యం విషమించిందని సోషల్‌మీడయాలో న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే, ఈ వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. సిరివెన్నెల కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారని.. ప్రస్తుతం బాగానే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.
రెండు రోజుల క్రితమే సిరివెన్నెల కిమ్స్‌లో చేరినట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. దీంతో చికిత్స తీసుకునేందుకే ఆయన కిమ్స్‌లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిరివెన్నెల. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబసభ్యులు విషయంపై స్పందించి.. వార్తలను ఖండించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కాగా, సిరివెన్నెల సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ జనాన్ని నిగ్గదీసి అడిగి.. తన పదసంపద ఒంపుల్లో ప్రేమ, బాధ, కరుణ, రౌద్రం.. ఇలా నవరసాలను పండంచిన వ్యక్తి సిరివెన్నెల. ఏదైనా పాట రాయాలంటే..పెన్ను సిరాలోంచి అక్షరాలు తూటాల్లా దూసుకెళ్లి వస్తుంటాయి. ప్రతి మనసును కదిలించి.. నిద్ర లేకుండా చేస్తాయి. అంతటి శక్తి ఆయన రచనా సాహిత్యానికి ఉంది. ఇప్పటికీ ఎన్నో నిద్రలేన రాత్రుల్లో.. చీకటి పొరల్ని చీల్చుకుని వచ్చే వెలుగులా తన అక్షరాల్ని జనాలపై సంధస్తున్నారు సిరివెన్నెల.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sirivennela family responded about his health condition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com