https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: హౌస్ లో దుమారం లేపుతున్న షన్ను, సిరి ల డీప్ కనెక్షన్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ గేమ్ షో లో ప్రేక్షకులని అలరించడానికి కచ్చితం గా ఒక ప్రేమ జంట ఉండాల్సిందే. అలా ఈ సీజన్ కి గానూ హమీదా – శ్రీరామా చంద్ర జంట తమ కెమిస్ట్రీ తో జనాలని ఆకట్టుకున్నా… కానీ అనుకోకుండా ఐదో వారంలో హమీదా ఎలిమినేట్ అవ్వడం తో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. వన్ సైడ్ లవ్ ట్రాక్ తో మానస్ – ప్రియాంక జంట […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 19, 2021 / 03:23 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ గేమ్ షో లో ప్రేక్షకులని అలరించడానికి కచ్చితం గా ఒక ప్రేమ జంట ఉండాల్సిందే. అలా ఈ సీజన్ కి గానూ హమీదా – శ్రీరామా చంద్ర జంట తమ కెమిస్ట్రీ తో జనాలని ఆకట్టుకున్నా… కానీ అనుకోకుండా ఐదో వారంలో హమీదా ఎలిమినేట్ అవ్వడం తో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. వన్ సైడ్ లవ్ ట్రాక్ తో మానస్ – ప్రియాంక జంట హౌస్ లో హల్ చల్ చేస్తుంది. తాజా గా ఈ కోవలోకి ఇంకో జంట చేరింది.

    షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంతు పరిచయం లేని పేర్లు. ఇద్దరు యూట్యూబ్ లో తమకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి వెబ్ సీరీస్, వీడియోస్ కుడా చేసారు. ఇంత క్రేజ్ సంపాదించిన ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ షో కి కలసికట్టుగా వచ్చారు. ముందు నుండే పరిచయం ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రంబోల చేస్తున్నారు. పరిచయం ఉంది కాబట్టి పక్కా పెద్ద ప్రణాళికలతో, వ్యూహాలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

    అయితే తాజాగా నిన్న బిగ్ బాస్ లో జరిగిన సంఘటన పెద్ద దుమారమే రేపుతోంది. ఎమోషనల్ సెంటిమెంట్ అనే మాట గత నాలుగు రోజులనుండి హౌస్ లో మారుమోగుతోంది. షన్ను, సిరి ఎమోషనల్ గా ఒకరి మీద ఒకరు బాగా డిపెండ్ అయ్యి కనెక్ట్ అయ్యారు. ముందునుండి ఉన్న పరిచయం కాబట్టి.. వాళ్ళ ఇద్దరి మధ్య “అంతకుమించి” కంటే ఎక్కువే బాండింగ్ ఏర్పడింది. నిన్న మళ్ళీ సన్ను, సిరి ల మధ్య ఏదో గొడవ జరిగింది. ఒకరితో ఒకరు కాసేపు మాట్లాడుకోలేదు. ఈ తరుణం పక్క బెడ్ మీద ఉన్న సిరి, షన్ను కూర్చున్న బెడ్ మీద వచ్చి బుగ్గ మీద ముద్దు ఇవ్వబోతుండగా అది లైట్ గా లిప్ కి తాకడం తో షన్ను ఒక్కసారిగా నివ్వెరపోయాడు. దానిని బిగ్ బాస్ నిర్వాహకులు బ్లర్ గా వేసి ప్రసారం చేశారు.

    బిగ్ బాస్ అంటే చిన్నా – పెద్దా తేడా లేకుండా చూసే కార్యక్రమం. నిన్నజరిగిన ఎపిసోడ్ లో షన్ను, సిరి ల మధ్య జరిగిన బెడ్ రూమ్ సన్నివేశాలు డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చెయ్యలేదు నిర్వాహకులు.

    Tags