https://oktelugu.com/

ప్రియుడి మరణం తలచుకొని భావోద్వేగమైన సిరి..!

బిగ్ బాస్ హౌస్ లో గత ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ లు అందరూ వారి మొదటి లవ్ గురించి చెప్పాలని బిగ్ బాస్ సూచించడంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వారి మొదటి ప్రేమ గురించి తెలియజేస్తూ వచ్చారు. ఇలా ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కో విధంగా ఉంటూ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇక హౌస్ లో ఒకరైన సిరి ప్రేమ కథ విన్న హౌ సభ్యులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విధంగా సిరి తనఫస్ట్ లవ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 25, 2021 / 11:30 AM IST
    Follow us on

    బిగ్ బాస్ హౌస్ లో గత ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ లు అందరూ వారి మొదటి లవ్ గురించి చెప్పాలని బిగ్ బాస్ సూచించడంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వారి మొదటి ప్రేమ గురించి తెలియజేస్తూ వచ్చారు. ఇలా ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కో విధంగా ఉంటూ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇక హౌస్ లో ఒకరైన సిరి ప్రేమ కథ విన్న హౌ సభ్యులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విధంగా సిరి తనఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ…తాను పదవ తరగతిలో ఉన్నప్పుడే తన ఎదురింట్లో ఉండే విష్ణు అనే ఒక అబ్బాయిని ప్రేమించానని తెలిపింది.

    విష్ణు పొసెసివ్ గా ఉండటం వల్ల తరచూ మా మధ్య గొడవలు జరిగేవి. ఇలా ఒకసారి గొడవపడి ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం చేసుకోవడానికి సిద్ధమయ్యానని, తెల్లవారితే నిశ్చితార్థం అనగా ఆ రోజురాత్రి విష్ణు నా దగ్గరకు వచ్చి నేను తప్పుచేశాను, నన్ను క్షమించు, నువ్వంటే నాకిష్టమని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయితే విష్ణు అంటే తనకు కూడా ఎంతో ఇష్టమని కేవలం తన మీద కోపంతో పెళ్లికి ఒప్పుకున్న సిరి తెల్లవారితే నిశ్చితార్థం ఏం చేయాలో తెలియక ఇంటి నుంచి పారిపోయినట్లు ఈ సందర్భంగా తెలిపింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు తనకి నచ్చజెప్పడంతో తిరిగి వచ్చానని తిరిగి వచ్చిన తర్వాత విష్ణుతో రిలేషన్ ఎంతో బాగుండేదని ఈ సందర్భంగా తెలియజేసింది.

    ఇలా మేమిద్దరం రిలేషన్ లో ఉండగా ఎన్నో సార్లు గొడవలు జరిగిన సర్దుకుపోయేవాళ్ళము. ఒక రోజు రాత్రి పడుకున్న తర్వాత తెలవారి 3 గంటలకు మెలుకువ వచ్చింది. లేచి కాసేపాగి నిద్రపోయాను. మరి ఎనిమిది గంటలకు నిద్ర లేవగా ఒక షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందని సిరి భావోద్వేగం అయింది. 3 గంటలకి మెలకువ వచ్చిన సమయంలో విష్ణు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.అనే వార్త విన్నానని చెబుతూ ఎమోషనల్ కాగా ఈమె ప్రేమ కథ విన్న కంటెస్టెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకొని సిరిని ఓదార్చారు.