కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే విషయం తెలిసిందే. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలు ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది. అమ్మాయి ఉన్నతచదువులు, పెళ్లి కోసం డబ్బులు దాచుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
పది సంవత్సరాల లోపు ఆడపిల్లలను ఈ స్కీమ్ లో చేర్పించే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై కేంద్ర ప్రభుత్వం ఏకంగా 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లేదా పోస్టాఫీస్ ల ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ లో లక్షన్నర ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
రోజుకు కేవలం 416 రూపాయలు పొదుపు చేస్తే ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 65 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ స్కీమ్ ద్వారా తక్కువ పొదుపుతో ఎక్కువ లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకు 5,000 రూపాయల చొప్పున చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో 25 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను సైతం పొందవచ్చు . ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ తో పోలిస్తే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకురుతుందని చెప్పవచ్చు.