Homeఎంటర్టైన్మెంట్Single Movie Twitter Talk : సింగిల్ మూవీ ట్విట్టర్ టాక్: శ్రీవిష్ణు మూవీ హిట్టా...

Single Movie Twitter Talk : సింగిల్ మూవీ ట్విట్టర్ టాక్: శ్రీవిష్ణు మూవీ హిట్టా ఫట్టా?

Single Movie Twitter Talk : కామెడీ చిత్రాల హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ సింగిల్. ఈ మూవీ ట్రైలర్ వివాదం రాజేసింది. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీని సింగిల్ మూవీలో ట్రోల్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై శ్రీవిష్ణు వివరణ ఇచ్చాడు. ఆ వివాదం సంగతి అటుంచితే.. సింగిల్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. అంచనాలు పెరిగాయి. మరి సింగిల్ మూవీ ఆ అంచనాలు అందుకుందా?

సింగిల్ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. సింగిల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. శ్రీవిష్ణు పెర్ఫార్మన్స్ కి మాత్రమే మంచి మార్కులు వేస్తున్న ఆడియన్స్, కథలో మాత్రం మేటర్ లేదని అంటున్నారు. కొత్తదనం లేని కథ, పట్టులేని స్క్రీన్ ప్లే ఏమంత మెప్పించలేకపోయాయని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్లో అయ్యింది. నిరాశపరిచిందని అంటున్నారు. మ్యూజిక్ సైతం నిరాశపరిచింది.

వన్ లైనర్స్, వెన్నెల కిషోర్ కామెడీ మెప్పించే అంశాలు. మొత్తంగా సింగిల్ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. శ్రీవిష్ణు పంచులు, పెర్ఫార్మన్స్ మాత్రమే చెప్పుకోదగ్గ అంశాలు అనేది ఆడియన్స్ అభిప్రాయం. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ సింగిల్ మూవీపై ఈ విధంగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Exit mobile version