Single Movie First Review: యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు శ్రీవిష్ణు(Srivishnu). కెరీర్ ప్రారంభం లో ఈయన క్యారక్టర్ రోల్స్ ద్వారానే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరో గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. శ్రీవిష్ణు సినిమా అంటే కచ్చితంగా ఎదో వైవిద్యం ఉంటుంది, థియేటర్స్ లో చూడాల్సిందే అనే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అందుకే ఆయన సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ దక్కుతుంటాయి. కొంతకాలం ఫ్లాప్స్ తో మార్కెట్ కి చిల్లు పెట్టుకున్న శ్రీవిష్ణు, ‘సామజవరగమనా’ చిత్రం తో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘స్వాగ్’ చిత్రం మంచి ప్రయత్నం గా మిగిలింది కానీ, కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన ‘సింగిల్'(Single Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది.
కేతిక శర్మ(Kethika Sharma), ఇవానా(Ivana) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు అనే తమిళ డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. ‘తండేల్’ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్ గానే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ లో ఎంతటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు బాగా తక్కువ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే ఫుల్ టైం పాస్ మూవీ లాగా ఆడియన్స్ కి అనిపించింది. హీరో శ్రీవిష్ణు కూడా ఈ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు నవ్వుతూనే ఉంటారని, ఇంటర్వెల్ సమయం లో పాప్ కార్న్ కొనుక్కుంటే, మీరు నవ్వే నవ్వుకి ఆ పాప్ కార్న్ మొత్తం క్రింద పడిపోతుందని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమా ఫైనల్ కాపీ ని ప్రసాద్ ల్యాబ్స్ లో మూవీ టీం కొంతమంది మీడియా ప్రముఖులకు స్పెషల్ షో వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో ఒక సినిమాకు ఇంత నవ్వుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదని, కమర్షియల్ గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ నంబర్స్ ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయే రేంజ్ లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. వచ్చిన సమాచారం నిజమైతే, కచ్చితంగా ఈ ఏడాది ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిన్న చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.
Also Read : హీరో శ్రీవిష్ణు ని మోసం చేసిన బిగ్ బాస్ బ్యూటీ..కోట్ల రూపాయిల నష్టం..చెప్పాపెట్టకుండా పరార్!