https://oktelugu.com/

Singer Sunitha Son: అమ్మకు రెండో పెళ్లి అయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తున్నాడు… సింగర్ సునీత కొడుకు షాకింగ్ కామెంట్స్

కుటుంబ సభ్యులను అడిగి చెబుతానన్న సునీత... వారి అనుమతితో ఎస్ చెప్పారు. నిరాడంబరంగా రామ్-సునీతల ఎంగేజ్మెంట్ జరిగింది. 2021 జనవరిలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2024 / 05:57 PM IST

    Singer Sunitha Son

    Follow us on

    Singer Sunitha Son: సింగర్ సునీత రెండో వివాహం ఒక సంచలనం. 42 ఏళ్ల వయసులో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. మొదటి భర్తతో విడిపోయిన సునీత చాలా కాలంగా ఒంటరిగా ఉన్నారు. పిల్లలు, పేరెంట్స్ తో కలిసి జీవించారు. లాక్ డౌన్ సమయంలో మ్యాంగో మీడియా అధినేత రామ్ సింగర్ సునీతతో తరచుగా మాట్లాడుతూ ఉండేవారట. వీరికి చాలా కాలంగా వృత్తిపరంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో రామ్ ఒకరోజు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారట.

    కుటుంబ సభ్యులను అడిగి చెబుతానన్న సునీత… వారి అనుమతితో ఎస్ చెప్పారు. నిరాడంబరంగా రామ్-సునీతల ఎంగేజ్మెంట్ జరిగింది. 2021 జనవరిలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. సునీత పెళ్లిపై విమర్శలు వినిపించాయి. స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేసే అర్హత ఎవరికీ లేదని సెలెబ్రిటీలు ఓపెన్ అయ్యారు.

    సునీత పెళ్లిపై పిల్లలు ఏనాడూ మాట్లాడలేదు. కొడుకు, కూతురు దగ్గరుండి ఈ వివాహం చేశారు. కాబట్టి వారికి సమ్మతమే అనుకోవచ్చు. కాగా మొదటిసారి సునీత కొడుకు ఆకాష్ నోరు విప్పారు. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆకాష్ మాట్లాడుతూ… చిత్ర పరిశ్రమలో పోటీ చాలా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని భరిస్తూనే అమ్మ నన్ను, చెల్లెలిని, అమ్మమ్మ, తాతయ్యలను చూసుకుంది.

    రెండో పెళ్లి విషయంలో అమ్మ చాలా భయపడింది. మేము ఎలా అర్థం చేసుకుంటామో అనే సందిగ్ధతకు గురైంది. అప్పుడు ఆయన(రామ్)పై మీకు నమ్మకం ఉందా? అని అడిగాను . ఉందని అమ్మ చెప్పింది. అమ్మ చాలా కాలంగా ఎమోషనల్ సపోర్ట్ మిస్ అవుతుంది. అమ్మ సంతోషమే మాకు ముఖ్యం. అందుకే పెళ్లి చేశాము. రెండో పెళ్లి అయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తారు. నాన్నతో రామ్ ఫ్రెండ్లిగా ఉంటారు. కోపం, పగ వదిలేసి హాయిగా జీవనం సాగిస్తున్నాం, అని చెప్పుకొచ్చాడు. ఆకాష్ హీరోగా లాంచ్ కాగా, అతని మొదటి చిత్రం సర్కారు నౌకరి జనవరి 1న విడుదలైంది…