https://oktelugu.com/

Singer Sunitha: ‘సింగర్ సునీత’ చెరుకు రసం.. నెటిజన్లు ఫిదా !

Singer Sunitha: తన గాత్రం, అందంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సునీతలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా సునీత […]

Written By:
  • Shiva
  • , Updated On : May 4, 2022 / 08:46 AM IST
    Follow us on

    Singer Sunitha: తన గాత్రం, అందంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సునీతలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

    Singer Sunitha

    ఇదే క్రమంలో తాజాగా సునీత ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేశారు. సునీత వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఆమెకు ఒక చెరుకు గానుగ కనిపించింది. వెంటనే.. ఆమె కారు దిగి ఆ గానుగ దగ్గరకు వెళ్ళింది. ఆ గానుగను ఉత్సహంగా తిప్పుతూ చెరుకు రసం తీసింది. పైగా ఇదంతా రికార్డు తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సునీత పోస్ట్‌ చేశారు.

    Also Read: Samantha Cars: సమంత ఎన్ని కార్లు వాడుతుందో తెలుసా?

    ప్రస్తుతం ఈ వీడయో బాగా వైరల్‌ అవుతోంది. ‘సునీత తీసిన చెరుకు రసం మరింత తీయగా ఉంటుంది’ అంటూ నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా మారనుంది. మరి ఆమె నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    Singer Sunitha

    సునీతకు బుల్లితెర పై బోలెడు మంది అభిమానులు ఉన్నారు, అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది. మొత్తానికి భర్త రామ్‌ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు. సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్‌ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

    ఏది ఏమైనా సునీత గాత్రం ఎంతో కమ్మగా ఉంటుంది. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనాన్ని ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

    Also Read:Megastar Chiranjeevi Holiday Trip: ఒకపక్క మేము చనిపోతుంటే.. మీకు సరదాలు కావాలా చిరంజీవి ?

    Recommended Videos

    Tags