https://oktelugu.com/

Hero Nikhil: తండ్రి కోరిక కోసం తమ్ముడ్ని హీరోని చేస్తున్నాడు !

Hero Nikhil: అవకాశం ఉంటే.. హీరో అయిపోవాలని, అశేష అభిమానులను తెచ్చుకోవాలని.. ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. నిజానికి అవకాశం లేకపోయినా అందరికీ ఉంటుంది అనుకోండి. కాకపోతే.. ఈ రోజుల్లో కష్టపడితే రియల్ హీరో అవ్వొచ్చు ఏమో గానీ, రీల్ హీరోగా నిలబడాలి అంటే మాత్రం బోలెడు డబ్బు ఇండస్ట్రీలో గుమ్మరించాలి. అందరూ డబ్బు ఉంటేనే హీరో అవుతారా ఏమిటి ? విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోల పేర్లు చెప్పి.. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 4, 2022 / 08:54 AM IST
    Follow us on

    Hero Nikhil: అవకాశం ఉంటే.. హీరో అయిపోవాలని, అశేష అభిమానులను తెచ్చుకోవాలని.. ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. నిజానికి అవకాశం లేకపోయినా అందరికీ ఉంటుంది అనుకోండి. కాకపోతే.. ఈ రోజుల్లో కష్టపడితే రియల్ హీరో అవ్వొచ్చు ఏమో గానీ, రీల్ హీరోగా నిలబడాలి అంటే మాత్రం బోలెడు డబ్బు ఇండస్ట్రీలో గుమ్మరించాలి.

    hero nikhil family

    అందరూ డబ్బు ఉంటేనే హీరో అవుతారా ఏమిటి ? విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోల పేర్లు చెప్పి.. ఎవరైనా హీరో అవ్వొచ్చు అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా ప్రాక్టికల్ గా లక్షల్లో ఒకరికో ఇద్దరికో అది వర్కౌట్ అవుతాయి. కాబట్టి, ఆ రకంగా హీరో అవ్వడం అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టేద్దాం. ముందుగా హీరో అవ్వాలి అంటే మాత్రం, డబ్బు అయినా ఉండాలి,

    Also Read: Singer Sunitha: ‘సింగర్ సునీత’ చెరుకు రసం.. నెటిజన్లు ఫిదా !

    సినిమా రంగంలో బలమైన సపోర్ట్ అయినా ఉండాలి. అయితే, డబ్బు ఉన్నవాళ్లల్లో కూడా చాలామంది కుర్రాళ్లు ఎలాగోలా హీరోగా ఎంట్రీ ఇచ్చేయాలని పడిగాపులు కాస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల కుటుంబాలలోని పిల్లలకు అయితే, మరి ఎక్కువగా ఉంటుంది. హీరో అనే పేరుతో పాటు హీరోగా క్లిక్ అయితే కోట్ల రూపాయల సంపాదన,

    hero nikhil family

    పైగా సమాజంలో క్రేజ్, ఆ క్రేజ్ కి తగట్టు గౌరవం, అలాగే బోలెడంత గుర్తింపు.. ఇక చుట్టూ స్టార్ డమ్, అందుకే హీరో కావాలని హీరో నిఖిల్ తమ్ముడు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. పైగా నిఖిల్ తండ్రి కూడా తన చిన్న కుమారుడు హీరో కావాలని ఆశ పడ్డాడు. అందుకే, నిఖిల్ తన తండ్రి కోరిక తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడు.

    తన తమ్ముడ్ని హీరోగా లాంచ్ చేయాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మధ్యలో ఓ కొత్త దర్శకుడు కథను ఫైనల్ కూడా చేశారు. నిఖిల్ తమ్ముడు మొదట యాక్టింగ్ గురు సత్యానంద్ దగ్గర ప్రస్తుతం నటనలో మెళకువలు నేర్చుకోవాలని అనుకుంటున్నాడు.

    Also Read:Marriage Vow: పెళ్లినాటి ప్రమాణాల్లో అంతటి శక్తి ఉందా?

    Recommended Videos

    Tags