https://oktelugu.com/

పెళ్లి తరువాత సింగర్ సునీత.. ఎలా ఉందో తెలుసా ? పిక్ వైరల్

పెళ్లి తరువాత అమ్మాయిల్లో మార్పలు రావడం సహజం, దానికి తగ్గట్లుగానే చాలమంది అమ్మాయిలు ఫిజికల్ గా చాల మారిపోతారు. అయితే, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సునీత కూడా రెండో పెళ్లి తరువాత మారిపోతే, తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలో ఆమెలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు, సింగర్ సునీత రెండో పెళ్లి గురించి, ఆమె వయసు గురించి, ఆమె భర్త వయసు గురించి నెటిజన్లు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 11:28 AM IST
    Follow us on


    పెళ్లి తరువాత అమ్మాయిల్లో మార్పలు రావడం సహజం, దానికి తగ్గట్లుగానే చాలమంది అమ్మాయిలు ఫిజికల్ గా చాల మారిపోతారు. అయితే, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సునీత కూడా రెండో పెళ్లి తరువాత మారిపోతే, తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలో ఆమెలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు, సింగర్ సునీత రెండో పెళ్లి గురించి, ఆమె వయసు గురించి, ఆమె భర్త వయసు గురించి నెటిజన్లు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సునీత లేటెస్ట్ పిక్ చూసి నెటిజన్లు ఇంకా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సునీతలో చాల మార్పులు వచ్చేశాయి అంటున్నారు.

    Also Read: ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడో.. అది గొప్పే !

    తాజాగా సునీత తన భర్తతో క్లోజ్ గా దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా ఒక మెసేజ్ పాస్ చేసింది. రామ్ సూరపనేనితో తన దాంపత్యం ఎంత అన్యోన్యంగా సాగుతోందో పరోక్షంగా చెబుతున్నట్టుగా ఉంది ఈ ఫోటో. పైగా ఫొటోలో సునీత తన భర్త గుండె పై వాలి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మొత్తానికి అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు కూడా ఈ జంట పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే కొంతమంది లేట్ వయసులో పెళ్లి ఎక్కువే, మళ్ళీ ఈ రొమాంటిక్ పబ్లిసిటీ ఏమిటి అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు.

    Also Read: మెగాస్టార్ దెబ్బకు దివి రేంజ్ మారింది !

    మొత్తానికి సునీత పెళ్లి పై తెలుగు ప్రేక్షకులు మొదటి నుండి బాగా ఆసక్తి కనబరస్తూ వస్తున్నారు. అన్నట్టు త్వరలోనే సునీత దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని, సునీత ఏరి కోరి భర్తతో మాల్దీవులకు ప్లాన్ చేస్తోందట. ఏది ఏమైనా సునీత హనీమూన్ గురించి ఇలా రోజుకొక రకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్