Singer Smitha: మానవత్వానికి, సున్నిత హృదయానికి ప్రతీకగా నిలుస్తోంది జడ్జి స్మిత. ఆమె మంచితనానికి , సమున్నత వ్యక్తిత్వానికి , కళాభిమానానికి, సమాజసేవకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
పార్వతి ఊరికి బస్ వేయించిన ఆమె, ఈసారి రసూల్ భార్యకి వెండి పట్టీలు, నల్లపూసల గొలుసు ఇవ్వడం అందర్నీ కదిలించింది. పైగా అంత మంచి పనులు చేస్తూ కూడా ఆమె చూపించిన ప్రవర్తనకు ఆమెను అభినందించకుండా ఉండలేం. అందుకే.. అణకువకు, వినమ్రతకు నిలువెత్తు రూపం స్మిత.

రసూల్ ఒక ఆటో డ్రైవర్. దేవుడు ఇచ్చిన స్వరానికి అందరూ సమానమే అని నిరూపించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయినా కష్టపడి సంగీత సాధన చేశాడు. కానీ జీవనాధారం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు ఆటో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం అతనిది. బతకడం కోసమే జీవితాంతం పని చేస్తున్న రసూల్ కి సరిగమప జీ తెలుగు రూపంలో గొప్ప అవకాశం వచ్చింది.
Also Read: సినీ తారల నేటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
అయితే, ఈ షోకి రావడానికి రసూల్ తన భార్య కాళ్ళ వెండి పట్టీలు కూడా అమ్మాల్సి వచ్చింది. ఇంత కష్టపడి ఈ షోకి వచ్చిన రసూల్ పాటకు జడ్జ్ లు థ్రిల్ అయిపోయారు. ఇక రసూల్ గురించి తెలిసిన స్మిత గారు రసూల్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. రసూల్ భార్య కోసం వెండి పట్టీలు, నల్లపూసల గొలుసు ఇచ్చి తన గొప్ప మనసును మరోసారి ఘనంగా చాటుకుంది.

స్మిత, మొన్న పార్వతి కోరికనే కాదు ఓ ఊరి కలను కూడా తీర్చింది. ఇప్పుడు రసూల్ భార్య మనసును అర్థం చేసుకుని. ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఏది ఏమైనా సింగర్ స్మిత మంచితనానికి తెలుగు ప్రేక్షకులు ప్రతి ఎపిసోడ్ లో ఫిదా అవుతూనే ఉన్నారు. స్మిత ఇలాగే మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకుని ఏన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. స్మిత మంచి మనసుకు మా ‘ఓకేతెలుగు’ తరపున ప్రత్యేక అభినందనలు.
Also Read: భీమ్లా నాయక్ లో రానా పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..