Singer P. Susheela: భారత గాన కోయిలమ్మ, లెజండరీ గాయని పి.సుశీలకి అరుదైన గౌరవం దక్కింది. పి.సుశీల పేరిట పోస్టల్ శాఖ ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తున్నారు. అయితే, తన పేరిట పోస్టల్ స్టాంప్ రాబోతున్నందుకు సుశీల గారు పోస్టల్ శాఖకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. వేల పాటలు పాడిన మహా గాయని సుశీలకి ఇప్పుడు 86 ఏళ్ళు.

ఏది ఏమైనా సుశీల గారు గాన సరస్వతి, ఆమె గొప్పతనం మాటలకు అందనిది. ఆమె గొంతులో దైవత్వం ఏ గొప్పదనానికి సరితూగినది. ప్రస్తుతం చిత్రసీమ అంతా ‘ సుశీలమ్మా’ అంటూ ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాలలో కూడా ఆమె అద్భుతమైన గొంతు వింటూ ఈ నెల పులకరిస్తూనే ఉండాలని కోరుకుందాం.
ఎందుకంటే.. సుశీల గారు పాడిన ప్రతీ పాట ప్రత్యేకతమైనదే. ప్రతి ప్రత్యేకమైన పాట ఎప్పటికీ హృదయాలను తాకే విలువైన పాటే. అన్నట్టు సుశీల గారిని 2008లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది.

విజయనగరంలో జన్మించిన సుశీల చిన్న వయసులోనే తండ్రి ప్రోత్సాహం తో గాయని గా మారారు. మద్రాస్ వెళ్లి గాయనిగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఆమె వారసత్వం కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బాగా యాక్టివ్ గా ఉంది. ఇక సుశీల గారు భవిష్యత్తులో గొప్ప బిరుదులు పొందాలని కోరుకుందాం.